Nude Cruises: సముద్ర ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ, అలలు, మనకు నచ్చిన బట్టలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఆ ఊహే వేరబ్బా. అలాంటి వారికి నేను చెప్పే ఈ సముద్ర ప్రయాణం నిజంగా ఒక ప్రత్యేక అవకాశం. కానీ ఇందులో ఒక ట్విస్టు ఉందండోయ్. అదేంటంటే ఈ క్రూయిజ్‌లో మీరు బట్టలు ధరించకూడదు! ఏంటీ షాక్ తిన్నారా? అవును, మీరు సరిగ్గా విన్నారు. ‘బేర్ నెసెసిటీస్’ అనే క్రూయిజ్ కంపెనీ ప్రత్యేకంగా బట్టలు లేకుండా సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించే విధంగా ఓడలను నిర్వహిస్తుంది. ఇది కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ కొన్ని నియమాలు, పరిమితులు కూడా ఉన్నాయి.
ఇందులో ప్రయాణించడానికి నిబంధనలు
క్రీడలు, వినోదం, స్విమ్మింగ్ సమయంలో ఇక్కడ బట్టలు లేకుండా ఉండటంలో ఎటువంటి సమస్య ఉండదు. మీరు పూల్‌లో ఈత కొట్టవచ్చు, సన్‌బాత్ చేసుకోవచ్చు, డ్యాన్స్ హాల్‌లో సరదాగా నృత్యం చేసుకోవచ్చు. ఈ సారూప్య సందర్భాల్లో బట్టలు అవసరం లేదు. కానీ, భోజన సమయాలు, విందులు, డైనింగ్ రూమ్‌లలో మాత్రం వేరే నియమాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో మీ ప్రైవేట్ భాగాలను కవర్ చేయడం తప్పనిసరి. డైనింగ్ రూమ్‌లో బాత్‌రోబ్‌లు ధరించి భోజనం చేయడం అనుమతించబడదు. అందువల్ల, ప్రతీ ఒక్కరు సాధారణ దుస్తులు ధరించి భోజనం చేసుకోవాలి. ఈ క్రూయిజ్‌లో బట్టలు లేకుండా ఉండటం తప్పు అనుకోవడం, దానికి సంబంధం లేదు. కాబట్టి ఎవరూ ఇక్కడ ఎవరికి తగ్గట్టు వారికి ప్రవర్తిస్తే, వారి సరదాకు సమస్య లేదు. కానీ, ఇతరుల శరీరాన్ని అనుచితంగా తాకడం, బహిరంగ లైంగిక కార్యకలాపాలు కోరడం కఠినంగా నిషేధించారు.
Also Read: Director: జీవిత రాజశేఖర్ నన్ను మోసం చేశారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
ఇక్కడ ఫోటోలు తీయకూడదు
ఇక్కడ ఫోటోలు కూడా తీయడం దానికి తగ్గట్టుగానే నియమాలు ఉంటాయి. పూల్, డ్యాన్స్ హాల్ చుట్టూ నో ఫోటో జోన్లు ఏర్పాటు చేశారు. అంటే బట్టలు లేకుండా సరదాగా తిరుగుతూ, ఇతరుల ప్రైవసీని గౌరవించడం తప్పనిసరి. ఇలా ‘బేర్ నెసెసిటీస్’ క్రూయిజ్ ఒక ప్రత్యేకమైన, సాహసిక అనుభవాన్ని ఇస్తుంది. బట్టలు లేకుండా సరదా చేయడం వలన మీరు కొత్త అనుభూతులను పొందవచ్చు, కానీ నియమాలను గౌరవించడం, మర్యాదను మర్చిపోకపోవడం అత్యంత ముఖ్యం. కాస్త ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు, కానీ సముద్రంలో సాహసిక అనుభవాల కోసం ఇది ఒక ఆసక్తికర మార్గం.
క్రూయిజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
క్రూయిజ్ ప్రయాణం గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానికి వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి. అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లేదా ఫోటోలు తీయడంపై పాలసీ ఏంటి? ఈ రోజుల్లో ప్రతి విషయం ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోతుంది. ఎవరో దొంగగా ఫోటో తీస్తే, మనం మనకు తెలియకుండానే ఇంటర్నెట్‌లో పడిపోతామేమో అని భయమేస్తుందని ఒకరు ప్రశ్నించాడు. దీనికి అసలు పోస్టు చేసిన వ్యక్తి సమాధానం ఇచ్చాడు “ఇక్కడ చాలా మంది ఇప్పటికే న్యూడిస్ట్ అనుభవం ఉన్నవాళ్లు. అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ వేరేవారు ఫోటోలు తీయకూడదు.
2,300 మంది ప్రయాణం చేస్తారా?
నిజానికి న్యూడ్ బీచ్‌లలో కన్నా ఇక్కడ చాలా సేఫ్‌గా అనిపించింది. ఈ ప్రయాణంలో దాదాపు 2,300 మంది ప్రయాణం చేస్తారు. దాదాపు ఎవరూ తమ కేబిన్ బయట ఫోన్లను వాడలేదు. ప్రతి చోటా స్పష్టంగా బోర్డులు పెట్టారు. ఆ కంపెనీ సిబ్బంది కూడా బాగా కంట్రోల్ చేసారు. నిజానికి నేను ఆన్‌లైన్‌లో కూడా వెతికాను, కానీ ఈ క్రూయిజ్ నుంచి ఎప్పుడూ దొంగ ఫోటోలు బయటకు వచ్చినట్టు చూడలేదు. అందువల్ల నాకు ఎలాంటి భయం అనిపించలేదని అన్నాడు.
టవాల్స్ ఉండవా?
మరొకరు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరెప్పుడూ తువాలు వెంట తీసుకెళ్తారా? అసౌకర్యంగా ఉండదా? అని. దీనికి అతని సమాధానం అవును, తప్పనిసరిగా ఎవరికైనా కూర్చోవాలంటే, తమ శరీరానికి కింద తువాలు వేసుకోవాలి. ఓడలో ఎక్కడ చూసినా శుభ్రమైన టవల్స్ అందుబాటులో ఉంటాయి. కానీ నేను వ్యక్తిగతంగా మరింత శుభ్రంగా జాగ్రత్తగా వాడుకున్నాను. ఎందుకంటే నగ్నంగా ఉండటమే ఒక కొత్త అనుభవం” అని అన్నాడు. అది అద్భుతంగా అనిపించింది. వాతావరణం బాగుంది. బీచ్‌లు, రిసార్ట్స్, డ్యాన్సింగ్, బార్లలో సరదాగా – అన్నీ నగ్నంగానే అనుభవించగలిగాం. నా 61 ఏళ్ల భాగస్వామి కూడా ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించారు. విన్నారుకదా మరి, మీరు ఇలాంటి క్రూయిజ్‌లో ప్రయాణించే ధైర్యాన్ని చూపగలరా?