BigTV English

Anti Aging Tips: ప్రతి రోజు ఇలా చేస్తే చాలు.. ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్‌గా కనిపిస్తారు

Anti Aging Tips: ప్రతి రోజు ఇలా చేస్తే చాలు.. ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్‌గా కనిపిస్తారు

Anti Aging Tips: ఎవ్వరూ తమ వయస్సు కంటే పెద్దదిగా కనిపించాలని కోరుకోరు. ఉన్న వయస్సు కంటే తక్కువ లాగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ కొన్ని సార్లు కాలుష్యం, పోషకాహార లోపంతో పాటు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం, సన్ స్క్రీన్ వాడకుండా సూర్య కిరణాలకు గురికావడం వల్ల చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు వస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. 3 రకాల టిప్స్ మీ ఏజ్ ఎంత పెరిగినా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. పుష్కలంగా నీరు త్రాగాలి:
ఆరోగ్య పరంగా మీరు మీ శరీరానికి ఇవ్వగల గొప్ప వరం నీరు. మీరు ఎక్కడికి వెళ్లినా, మీతో వాటర్ బాటిల్ ఉంచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నీరు త్రాగుతూ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. నీరు మీ శరీరాన్ని హైడ్రేషన్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా హైడ్రేషన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం తేమను నిర్వహించడంతో పాటు, ఇది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. హైడ్రేటెడ్ చర్మం యొక్క స్థితిస్థాపకత పెరుగుతుంది. అంతే కాకుండా ముడతలతో పాటు ముఖంపై గీతలను దూరం చేస్తుంది. ఫలితంగా అకాల వృద్ధాప్యాన్ని కూడా నిరోధిస్తుంది.

ఇది మొటిమలను దూరం చేస్తుంది, పొడి చర్మం వల్ల కలిగే దురద లేదా పగిలిన చర్మాన్ని కూడా నయం చేస్తుంది. నీరు చర్మంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల ఆక్సిజన్ , పోషకాలు చర్మానికి చేరుతాయి. దీంతో చర్మం మరింత మెరుస్తుంది.


2. పుష్కలంగా నిద్ర:
నిద్ర లేకపోవడం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గాఢ నిద్ర వల్ల దెబ్బతిన్న కణాలను గ్రోత్ హార్మోన్లు రిపేర్ చేస్తాయి. నిద్ర పూర్తి కానప్పుడు, ఈ మరమ్మత్తు ప్రక్రియ చెదిరిపోతుంది. కాలక్రమేణా ముడతలు, ముఖంపై సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి.

నిద్ర లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అంతే కాకుండా కళ్లలో వాపు వంటివి వస్తాయి. నిద్ర లేకపోవడం రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం అవుతుంది. ఇది పొడి చర్మం, మొటిమల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

Also Read: అలోవెరాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు రాలనే రాలదు

3. ఆరోగ్యకరమైన ఆహారం:
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్ ఫైటోఈస్ట్రోజెన్ వంటి ముఖ్యమైన పోషకాలను ఆహారంలో చేర్చుకోండి. లైకోపీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతే కాకుండా చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడతాయి. ఫలితంగా చర్మం యవ్వనంగా , తాజాగా కనిపిస్తుంది. ప్రూట్స్ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు  చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×