Aloe Vera For Hair :ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారు అలోవెరాను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలోవెరాలో ఉండే ఔషధ గుణాలు జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
అలోవెరాలో కొన్ని రకాల పదార్థాలు కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి జుట్టు రాలకుండా ఉండేందుకు అలోవెరాను ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తైన జుట్టు కోసం అలోవెరా జెల్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యకరమైన బలమైన ,మెరిసే జుట్టు కావాలంటే మీరు కలబందను తరుచుగా ఉపయోగించాలి.
జుట్టుకు అలోవెరా వల్ల కలిగే ప్రయోజనాలు:
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: కలబందలోని ఎంజైమ్‌లు , అమైనో యాసిడ్‌లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతాయి.జుట్టును మందంగా చేయడంలో కూడా సహాయపడతాయి.
చుండ్రును తగ్గించడంలో సహాయకారి: కలబందలో యాంటీ ఫంగల్ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను శుభ్రపరచడం ద్వారా చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది స్కాల్ప్ దురద , మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
చిట్లిన జుట్టును తగ్గిస్తుంది: మీ జుట్టు పొడిగా, చిక్కుబడ్డట్లయితే అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల ఇది మీ జుట్టును సులభంగా హ్యాండిల్ చేయడంలో సహాయపడుతుంది.
జుట్టులో సహజ మెరుపు:
అలోవెరా జెల్ జుట్టును లోతుగా కండిషన్ చేస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టుకు తేమను అందించి, మృదువుగా మెరిసేలా చేస్తుంది.
జుట్టు పెరుగుదల:
కలబందలో ఉండే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా స్కాల్ప్‌ను ఆరోగ్యవంతంగా చేస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అలోవెరా జెల్ జుట్టుకు ఇలా అప్లై చేయండి:
తలకు మసాజ్ చేసే విధానం: అలోవెరా జెల్‌ను తలకు సున్నితంగా మసాజ్ చేయాలి. 5- 10 నిమిషాల పాటు అలోవెరా జెల్ జుట్టుకు అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.
జుట్టు మొత్తానికి అలోవెరా జెల్ అప్లై చేయాలి. వీలైతే ముందు రోజు రాత్రి అప్లై చేసుకుని తలస్నానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: బియ్యం పిండితో ఇలా చేస్తే.. ఎంత నల్లటి ఫేస్ అయినా మెరిసిపోతుంది
షాంపూతో జుట్టును వాష్ చేయాలి: అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఇది జుట్టులోని మురికిని తొలగించడమే కాకుండా వాటిని మృదువుగా , సిల్కీగా మారుస్తుంది. అలోవెరా జెల్ తరుచుగా జుట్టుకు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చుండ్రు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.