BigTV English

Cat Resignation Woman Job: రాజీనామా పంపిన పిల్లి.. ఉద్యోగం కోల్పోయిన యువతి!

Cat Resignation Woman Job: రాజీనామా పంపిన పిల్లి.. ఉద్యోగం కోల్పోయిన యువతి!

Cat Resignation Woman Job| ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రమాదవశాత్తు జరిగే కొన్ని అరుదైన పనుల వల్ల కొందరు చేదు అనుభవాలను చవిచూడాల్సి వస్తుంది. తాజాగా ఓ పిల్లి పొరపాటున చేసిన పనికి దాని యజమాని భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఉద్యోగం ఒత్తిడి వల్ల దాన్ని కొనసాగించాలో లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్న ఓ యువతి.. తన పెంపుడు పిల్లి వల్ల మరింత కష్టాల్లో పడింది. ఆమె ప్రేమగా పెంచుకున్న పిల్లి పొరపాటున.. ఆమె ఆఫీసుకి రాజీనామా లేఖ పంపింది. ఈ ఘటన చైనాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని చాంగ్ ఖింగ్ పట్టణంలో నివసించే ఓ 25 ఏళ్ల యువతి ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే సరదా కోసం తన ఇంట్లో 9 పిల్లులను పెంచుకుంటోంది.

అయితే ఆమె చేస్తున్న ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా ఇబ్బందులు పడుతోంది. అందుకే తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ముందుగా ఇంట్లోని తన కంప్యూటర్ లో రాజీనామా లేఖ రాసి తన కంపెనీ హెచ్ ఆర్ విభాగానికి మెయిల్ చేయడానికి సిద్దంగా ఉంచింది. కానీ ఆమె ఆ మెయిల్ పంపలేదు. తను రాజీనామా చేస్తే.. వెంటనే మరో ఉద్యోగం లభించడం కష్టమని ఆమె స్నేహితులు సలహా ఇవ్వగా.. తాను ఆలోచించుకుంటూ ఉండిపోయింది. తనకు ఉద్యోగం లేకపోతే ఇంట్లోని మూగజీవాలను పోషించడం కష్టమైపోతుందని భావించి.. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు నచ్చకపోయినా అదే కంపెనీలో ఉద్యోగం కొనసాగించాలని నిర్ణయించుకుంది.


Also Read:  సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్

అలా ఆమె ఆలోచిస్తూ కంప్యూటర్ ఆన్ లో ఉన్న సంగతి మరిచిపోయి ఫోన్ లో తన స్నేహితులతో మాట్లాడుతూ ఇంటి బయటకు వెళ్లిపోయింది. అప్పుడు ఇంట్లోని ఒక పిల్లి ఆమె కంప్యూటర్ టేబుల్ పై ఎక్కి అటు ఇటు నడిచింది. దీంతో ఆ కంప్యూటర్ నుంచి ఆమె రాసిన రాజీనామా లేఖ కంపెనీ ఈ మెయిల్ కు సెండ్ అయిపోయింది. కాసేపు తరువాత ఆ యువతి ఇంట్లోకి వచ్చి కంప్యూటర్ స్విచాఫ్ చేసే క్రమంలో తన ఈమెయిల్ సెండ్ అయినట్లు చూసి షాకైపోయింది. తాను ఈ మెయిల్ సెండ్ చేయలేదు. మరి అక్కడ సెండ్ అయినట్లు చూపిస్తోంది. ఇదెలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు. అందుకే తన గదిలోని సిసిటీవి వీడియోని పరిశీలించింది. అందులో తన పిల్లి చేసిన నిర్వాకం చూసి నెత్తిపై చేతులు పెట్టుకోవడం మాత్రమే ఆమెకు మిగిలింది.

అయినా జరిగే నష్టాన్ని ఆపడానికి వెంటనే ఆఫీసుకి వెళ్లి అక్కడ జరిగిన తప్పు గురించి వివరించింది. తన పిల్లి పొరపాటున మెయిల్ సెండ్ బటన్ నొక్కేయడంతో ఆ మెయిల్ వచ్చిందని తెలిపింది. అయితే హెచ్ ఆర్ విభాగం వారు మాత్రం కంపెనీ యజమానిని సంప్రదించాలని సూచించారు. దీంతో ఆమె కంపెనీ ఓనర్‌తో కలిసి విషయం వివరించింది. అయితే ఆ ఓనర్ మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. తమ కంపెనీలో ఆమె అవసరం లేదని తేల్చి చెప్పేశాడు.

ఈ పరిణామాలతో ఆ యువతి ఉద్యోగం కోల్పోవడమే కాదు.. ఆమె సమయానికి ముందు రాజీనామా చేయడంతో తనకు రావాల్సిన బోనస్ కూడా కోల్పోయింది. తనకు జరిగిన నష్టం గురించి ఆ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తన ఇంట్లో ఉన్న 9 పిల్లులకు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నానని ఆమె వాపోయింది. దీంతో నెటిజెన్లు ఆమె పట్ల సానుభూతి చూపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరైతే ఆ పిల్లి కంపెనీ ఓనర్ తో కుమ్మకై కుట్ర చేసిందని రాశాడు.

పిల్లాడి చేతికి బాంబు అందించిన కుక్క
ఇలాంటిదే మరొక ఘటనలో ఒక కుక్క తన యజమాని కొడుకు చేతికి బాంబు అందించింది. ఇంట్లో పెంపుడు కుక్కలు ఏదైనా వస్తువులు విసిరితే వాటిని తిరిగి తీసుకొచ్చి యజమాని చేతికి అందించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే థాయ్ లాండ్ కు చెందిన ఒక సైనికుడు ఇంట్లో కొన్ని బాంబులను నల్లని టేపుతో చుట్టి గుండ్రా కారంలో కవర్ చేసి తన గదిలో పెట్టాడు.

Also Read: వైరల్ వీడియో కోసం సింహంతో ఆటలు.. పాకిస్తానీపై పంజా విసిరిన మృగరాజు

అయితే ఇటీవల ఆ సైనికుడి నాలుగేళ్ల కొడుకు ఇంట్లో తన పెంపుడు కుక్కతో గార్డెన్ లో ఆడుకుంటూ ఉండగా.. ఆ కుక్క లోపలి నుంచి నల్ల టేపులో గుండ్రంగా ఉన్న బాంబుని తీసుకొచ్చి ఇచ్చింది. అదృష్టవశాత్తు ఆ సైనికుడు అప్పుడే అక్కడికి వచ్చాడు. లేకపోతే పిల్లాడు దాన్ని విప్పడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఆ సైనికుడు వెంటనే దాన్ని లాగేసుకొని సురక్షితంగా దాన్ని గదిలో పెట్టి లాక్ చేశాడు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×