Copper Bottle: రాగి పాత్రలలో ఉంచిన నీటిని తాగడం అనేది కొత్త కాలం వెల్నెస్ హ్యాక్ ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది వేల సంవత్సరాల ముందు నుంచే ఉందట. కాపర్ పాత్రలలో ఉంచిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెప్తారు. అప్పట్లో వీటిలోనే ఆహారాన్ని నిల్వ చేసే వారని చెబుతారు. రోజులు మారుతున్న కొద్దీ వీటి వాడకం క్రమంగా తగ్గిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో కాపర్ వాటర్ బాటిల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని వాడడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. అయితే వీటిలో ఉంచిన నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే నిజంగానే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా..? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రాగి పాత్రలలో ఉంచిన నీళ్లను తాగడం వల్ల కడుపులోని మలినాలు తొలగిపోతాయట. హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయట.
ALSO READ: మొటిమలు ఎందుకు వస్తాయి..?
అంతేకాకుండా చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయని డాక్టర్లు చబుతున్నారు. రాగి పాత్రలోని సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయట. దీంతో స్కిన్ ఆరోగ్యవంతంగా మారుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ పనితీరును మెరుగపరిచేందుకు కూడా రాగి పాత్రలోని నీళ్లు సహాయపడతాయట.
హాని కూడా చేస్తుందట..!
కాపర్ పాత్రలలో ఉంచిన నీళ్లు, ఆహార పదార్థాలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
రాగి పాత్రలను అతిగా వాడడం వల్ల కొన్ని సార్లు శరీరంలో టానిన్స్ పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాగి పాత్రలను అతిగా వాడడం వల్ల చాలా మందిలో వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటివి వచ్చే ఛాన్స్ ఉందట.
అంతేకాకుండా చాలా మందిలో వీటిని ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాగి పాత్రలను కూడా అతిగా డాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.