Financial Success Rules: సాధారణంగా అనేక మందికి కూడా ధనవంతులు కావాలని కల ఉంటుంది. దీని కోసం దాదాపు ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ ఆ కలను నిజం చేసుకునే వాళ్లు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే సంపద అనేది కేవలం అదృష్టంతో మాత్రమే రాదని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం సరైన ఆలోచనలు, ఆచరణలో క్రమశిక్షణ, స్మార్ట్ పనితనంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని, సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మీ ఆదాయం అక్కడితోనే సరిపోతుందని అంటున్నారు. అయితే కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్పష్టమైన లక్ష్యాలు
ముందుగా మీరు ఏం కావాలనుకుంటున్నారనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు నెలకి ఎంత సంపాదించాలనుకుంటున్నారు. ఏ వయస్సు లో ఎన్ని కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు. మీ పాప పెళ్లి లేదా ఇళ్లు కోసం మనీ కావాలా అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత దానిని సాధించడానికి ఒక ప్లాన్ రూపొందించుకోవాలి.
ఉదాహరణకు మీరు 35 ఏళ్లలోపు 1 కోటి రూపాయల ఆస్తిని కలిగి ఉండాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ లక్ష్యానికి చేరుకోవడానికి నెలకి ఎంత పొదుపు చేయాలో, ఎంత ఆదాయం ఉండాలో అంచనా వేసుకోవాలి.
2. ఇతర ఆదాయ మార్గాలు కూడా
ప్రస్తుత కాలంలో కేవలం ఒక ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడడం సరైన నిర్ణయం కాదు. మీకు కుదిరిన సమయంలో ఇతర ఆదాయ మార్గాల గురించి అన్వేషించి, చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక భద్రత క్రమంగా పెరుగుతుంది.
ఉదాహరణకు: హోటళ్లు, బార్లు లేదా పార్ట్ టైం చేసుకునే ఉద్యోగాలపై ఫోకస్ చేయాలి. ఇది కాదంటే దీర్ఘకాలంలో యూట్యూబ్, బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు.
3. పొదుపు చేయడం అలవాటు
ప్రతి నెలా మీ సంపాదనలో కనీసం 20% డబ్బును పొదుపు చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో ఈ పొదుపు మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
పొదుపు చేసే పద్ధతులు:
-ఆటోమేటిక్ సేవింగ్స్ ప్లాన్ అమలు చేసుకోవాలి
-ఖర్చులను గమనించి, అవసరం లేని వాటిని తగ్గించుకోండి
-చిన్న వయస్సులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే, లాభాలు ఎక్కువగా ఉంటాయి (compound interest ప్రభావం)
Read Also: Honor Play 60 Series: 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి …
4. పెట్టుబడులు చేయడం
పొదుపు చేసిన డబ్బును సరైన పెట్టుబడుల్లో పెట్టడం వల్లే నిజమైన సంపద పెరుగుతుంది. మీ డబ్బు మీరు పని చేయకుండా సంపాదించేలా చేయడమే స్మార్ట్ నిధుల నిర్వహణ.
పెట్టుబడి మార్గాలు:
-స్టాక్స్ (లాంగ్ టర్మ్‌కి)
-మ్యూచువల్ ఫండ్స్ (SIPల ద్వారా)
-రియల్ ఎస్టేట్
-బిజినెస్‌లో భాగస్వామ్యం
-పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీం (NPS) వంటి భద్రమైన స్కీములు
5. మీ నైపుణ్యాల పెంపు
మీరు ఎంత ఎక్కువ నైపుణ్యాలు కలిగి ఉంటే, అంత ఎక్కువగా ఆదాయం పొందగలుగుతారు. నైపుణ్యాలు అనేవి మీలోని అసలైన సంపద అని చెప్పవచ్చు. ఈ క్రమంలో మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన నైపుణ్యాలలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, లీడర్ షిప్, క్రియేటివ్ థింకింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
6. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం
సమయం ధనానికి తల్లివంటిది. మీరు ప్రతి రోజు సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో మీరు సమయాన్ని ఉపయోగపడేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజు ప్లాన్ తయారుచేసుకోవాలి. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. Social Media, TV వంటి వాటిపై సమయం వృథా చేయకూడదు.
7. సరైన సంబంధాలు
మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సరైన వ్యక్తులను కలవడం, వారితో సంబంధాలు పెంచుకోవడం వల్ల మీరు అనేక అవకాశాలను పెంచుకుంటారు. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగి ప్రేరణ లభిస్తుంది. కాబట్టి మీరు ఓపెన్ మైండ్‌తో ఉండాలి. మీ ఆలోచనలను పంచుకోవాలి, ఇతరుల అభిప్రాయాలను స్వీకరించాలి.