BigTV English

Makeup Tips: వానలో తడిస్తే మేకప్ పోతుందని భయపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే మేకప్ చెక్కుచెదరదు

Makeup Tips: వానలో తడిస్తే మేకప్ పోతుందని భయపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే మేకప్ చెక్కుచెదరదు

Makeup Tips: ప్రపంచంలో అమ్మాయిలకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చేది మేకప్. మేకప్ లేకుండా కనీసం స్కూలుకు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. అందులోను తాజాగా వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చిందంటే అమ్మాయిల మేకప్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. మేకప్ వేసుకుని వెళ్లాలని ఆఫీసు లేదా స్కూలు, కాలేజీలకు బయలుదేరగానే ఒక్కసారిగా వర్షం వస్తే అందులో తడిచి మేకప్ అంతా పాడైపోతుంది. దీంతో సగం మేకప్ తో వెళ్లాల్సి వస్తుంది. దీంతో మేకప్ గురించి చాలా బాధపడుతుంటారు. అయితే వర్షంలో తడిచినా కూడా అందంగా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే వర్షంలో తడిసినా కూడా మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మేకప్ టిప్స్ :

ప్రైమర్


ముఖానికి మేకప్‌ వేసుకునే ముందుగా ప్రైమర్‌ను తప్పకుండా అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రైమర్ చర్మంపై మృదువుగా ఓ బేస్ ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మేకప్ ఎక్కువ సమయం పాటు నిలిచిఉండేలా తోడ్పడుతుంది. ముఖ్యంగా వర్షంలో మేకప్ వేసుకుని వెళ్లినా కూడా మేకప్ జారిపోకుండా సంరక్షిస్తుంది.

లైట్ ఫౌండేషన్

సీజన్ ను బట్టి వాడాల్సిన ఫౌండేషన్లు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతుంటాయి. అందులోను తేమ తగిలినా కూడా చర్మంపై మేకప్‌ను నిలిపే ఫౌండేషన్ ను ఎంచుకోవాలి. దీనివల్ల మేకప్ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది.

ఐషాడో, ఐలైనర్

మార్కెట్లో ప్రస్తుతం వాటర్ రెసిస్టెంట్ ఐషాడో, ఐలైనర్లు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగిస్తే ముఖంపై ఐ మేకప్ ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది.

లిప్‌స్టిక్‌

మేకప్ ఎంత వేసుకున్నా కూడా పెదవులకు లిప్‌స్టిక్ పెట్టకపోతే అసలు అందమే రాదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఉపయోగించే లిప్‌స్టిక్‌లలో బోల్డ్ షేడ్స్ ఉపయోగించడం వల్ల సౌకర్యంగా ఉంటుంది.

పౌడర్

చర్మానికి మేకప్ వేసిన అనంతరం దాన్ని సెట్టింగ్ చేయాలంటే మాత్రం అది పౌడర్ తోనే సాధ్యం. పౌడర్ వాడడం వల్ల మేకప్ చెక్కుచెదరదు. ముఖం జిడ్డుగా మారకుండా ఉండాలంటే పౌడర్ తప్పనిసరి వాడాల్సి ఉంటుంది.

సెట్టింగ్ స్ప్రే

ఫైనల్‌గా మేకప్ వేసుకున్న అనంతరం స్ప్రేతో దాన్ని సెట్ చేసుకోవాలి. రోజంతా మేకప్ తేమను తట్టుకుని ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే అవసరం.

Tags

Related News

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Big Stories

×