BigTV English
Advertisement

Eating Each Others Food: ఎంగిలి చేసిన ఆహారాన్ని తింటున్నారా ? అయితే మీరు ఈ వ్యాధుల బారిన పడినట్లే

Eating Each Others Food: ఎంగిలి చేసిన ఆహారాన్ని తింటున్నారా ? అయితే మీరు ఈ వ్యాధుల బారిన పడినట్లే

Eating Each Others Food: నిత్య జీవితంలో ఉండే కొన్ని అలవాట్లు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కునేలా చేస్తుంది. ముఖ్యంగా కొన్ని మంచి అలవాట్లు ఉంటే, కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి. ఇలాంటివి సాధారణమే అనిపించినా కూడా ఇలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. చాలా మందికి ప్రేమతో ఒకరికి ఒకరు తినిపించుకునే అలవాటు ఉంటుంది. అలా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఇలా ఒకరికి ఒకరు కలిసి తింటూ ఉంటారు. ఈ తరుణంలో ఒకే ప్లేట్లో భోజనాన్ని కలిసి ఎంగిలి ఆహారాన్ని కలిసి తినేస్తారు. ఇలా తినడం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని అనుకుంటారు. కానీ ఇలాంటిదే పెద్ద సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కలిసి భోజనం మాత్రమే కాకుండా చాక్లెట్, ఐస్ క్రీం, స్వీట్స్, ఫ్రైట్స్ ఇలా ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అలవాటు చాలా మందికి ఉండే ఉంటుంది. తరచూ పక్కన వారి ప్లేట్లో భోజనం చేస్తుండగా, దానిని తినడం చేస్తుంటారు. అంతేకాదు ఒకరు కొరికిన చాక్లెట్‌ను కొరికి తింటుంటారు. మనం తినే ప్లేట్ నుంచి ఆహారం వేరొకరితో షేర్ చేసుకున్నా, లేక వేరే వారి ప్లేట్లో ఆహారాన్ని తిన్నా కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ముఖ్యంగా బయట విచ్చలవిడిగా అమ్మే జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎంగిలి ఆహారం తీసుకోవడం వల్ల ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసుకుంటే అస్సలు అలాంటి పని కూడా చేయరని నిపుణులు అంటున్నారు. అయితే దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం.


అలెర్జీ :

వేరొకరు ఎంగిలి చేసిన ఆహారం తినడం వల్ల అలెర్జీల వంటి సమస్యలు ఏర్పడతాయి. వేరొకరి ప్లేట్లో భోజనం చేస్తుండగా దానిని తింటే అలెర్జీ ఏర్పడి అనారోగ్యం బారిన పడతారు. అంతేకాదు ఆరోగ్యం కూడా క్షీణించి ఇబ్బందుల పాలవుతారు. ఇలా ఒక్కసారి చేసినా కూడా సమస్యలు ఎదురై ఆరోగ్యం దెబ్బతింటుంది.

సంక్రమణ ప్రమాదం :

ఎంగిలి చేసిన భోజనం తినడం వల్ల అంటు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఒకరి ప్లేట్లో భోజనం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదవ ఏర్పడుతుంది. అంతేకాదు వేరొకరిది మాత్రమే కాకుండా మనం భోజనం చేసే ఆహారాన్ని కూడా వేరొకరితో పంచుకున్నా కూడా వారి ఆరోగ్యం పాడవుతుంది.

పేగు ఆరోగ్యం :

వేరే వారు తినే ఆహారంలో తినడం వల్ల వారి నోటిలో ఉండే బ్యాక్టీరియా లేదా వారి ప్లేట్ పై ఉండే బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. అంతేకదు కొంత మంది నాణ్యత మరియు శుభ్రత పాటించకుండా భోజనం చేస్తుంటారు. అందువల్ల వారు తినే ఆహారం తింటే బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాపిస్తాయి. అంతేకాదు దీని వల్ల కడుపు సంబంధింత సమస్యలు కూడా ఎదురవుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Vitamin C: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !

Diabetes:షుగర్.. ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా ?

Honey Health Benefits: ఆరోగ్యానికి తీపి చిట్కా.. ఒక చెంచా తేనెతో చలికాలం సమస్యలన్నీ దూరం!..

Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్.. చాలా మంది నిర్లక్ష్యం చేసే లక్షణాలివే !

Lower Cholesterol: మందులు లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించే.. సహజ మార్గాలు ఏంటో తెలుసా ?

Massage benefits: ఆయుర్వేదం చెప్పే 5 మసాజ్ రహస్యాలు.. డాక్టర్లు కూడా సూచించే థెరపీలు

Liver Disease: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే లివర్ పాడైనట్లే !

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి డ్రింక్స్ తాగాలి ?

Big Stories

×