Face Wash: మీ ముఖం కడుక్కునే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఫేస్ వాష్ అనేది మన చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగం. ఇది రోజులోని ముఖంపై పడే మురికి, దుమ్ము, నూనెలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కానీ, మీరు ముఖం కడుక్కోవడంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తే, అది మీ చర్మానికి ప్రయోజనం కాకుండా హాని కలిగిస్తుంది. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పు ఫేస్ వాష్‌ని ఎంచుకోవద్దు:
ప్రతి ఒక్కరి స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది. దానికి అనుగుణంగా ఫేస్ వాష్ ఎంచుకోవాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే , మీరు పొడి చర్మం కోసం తయారు చేసిన ఫేస్ వాష్‌ని ఉపయోగిస్తే, అది చర్మంపై మొటిమలు , మచ్చలను కలిగిస్తుంది. అదే సమయంలో ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్ ను డ్రై స్కిన్ పై అప్లై చేస్తే చర్మం మరింత డ్రైగా మారుతుంది. మీ చర్మ రకాన్ని బట్టి ఎల్లప్పుడూ ఫేస్ వాష్‌ని ఎంచుకోండి.
తరచుగా ముఖం కడుక్కోవద్దు:
తరచుగా ఫేస్ వాష్ చేయడం వల్ల చర్మం శుభ్రంగా , ఆరోగ్యంగా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. తరచుగా ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని సహజ తేమ తొలగిపోతుంది. అంతే కాకుండా స్కిన్ సున్నితంగా మారుతుంది. అందుకే రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖం కడుక్కోవడం సరిపోతుంది. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
నీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి:
ముఖం కడుక్కునేటపుడు చాలా చల్లటి లేదా అతి వేడి నీళ్ళు వాడటం తప్పు. ఇది చర్మంలోని సహజ నూనెను తొలగించి మీ చర్మానికి హాని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని వాడండి. ఎందుకంటే ఇది చర్మానికి సురక్షితమైనది. అంతే కాకుండా ప్రయోజనకరమైనది.
ముఖం రుద్దడం మానుకోండి:
ముఖం కడుక్కునే సమయంలో చర్మాన్ని ఎక్కువగా రుద్దడం లేదా గట్టిగా మర్దన చేయడం పెద్ద తప్పు. ఇది చర్మంపై ఎరుపు, చికాకు , వాపుకు కారణం కావచ్చు. ఫేస్ వాష్‌ను సున్నితంగా, వృత్తాకార కదలికలలో మర్ధనా చేయండి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఎటువంటి హాని కలిగించదు.
Also Read: పొడవాటి జుట్టు కోసం.. ఇలా చేయండి
ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం అవసరం :
ఫేస్ వాష్ తర్వాత చర్మానికి తేమ అవసరం. ఫేస్ వాష్ చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోకపోతే చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఎల్లప్పుడూ ఫేస్ వాష్ చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం తేమను పొంది ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయి స్కిన్ మెరిసిపోతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.