Garlic Peel: తరచూ వాడే ప్రతీ వంటలోను వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. వెల్లుల్లి లేకపోతే ఏ వంటకం కూడా అంత రుచిగా అనిపించదు మరి. వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు ఇలా ఏదో ఒకటైనా వంటకంలో కనిపించాల్సిందే. కేవలం వంటల్లోనే కాదు, ఊరగాయలు, చట్నీలు ఇలా ఎన్నో రకాల వాటికి వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. అయితే వెల్లుల్లిని వాడడం వరకు సరే. వెల్లుల్లిలో ఉండే పోషకాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. వెల్లుల్లితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తొలగిస్తాయి. అంతేకాదు చర్మం, జుట్టు వంటి వాటి పోషణకు కూడా వెల్లుల్లి తోడ్పడుతుంది.
వెల్లుల్లితో దీర్ఘకాలిక వ్యాధులను కూడా తరిమికొట్టవచ్చు. వెల్లుల్లిని తినడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో ఏర్పడే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. అయితే సాధారణంగా అయితే వెల్లుల్లిలో మాత్రమే పోషకాలు ఉంటాయని అందరూ భావిస్తుంటారు. దీంతో వెల్లుల్లి పొట్టును తీసి పడేస్తారు. కానీ వెల్లుల్లి పొట్టులో చెప్పలేనన్ని పోషకాలు ఉంటాయట.
వెల్లుల్లి తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని అలర్జీ చేసిన చోట అప్లై చేస్తే దురద, మంట వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి పొట్టు మంచి ఫలితాలను ఇస్తుందట. వెల్లుల్లి తొక్క నీరును జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు తొలగిపోతాయి. దీనిని మాడుకు స్ప్రే చేయడం వల్ల చుండ్రు, పేలు వంటివి కూడా తొలగిపోతాయి. పాదాల వాపు వంటి సమస్యతో బాధపడే వారికి కూడా వెల్లుల్లి పొట్టు ఉపయోగపడుతుంది.