Big Stories

CM Revanth Reddy: పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy latest news(TS today news): లోక్ సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 20 వేల మెజారిటీ వస్తుందని తెలిపారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు ఆరు నుంచి ఏడు స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. బీజేపీకి కేంద్రంలో 220 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 13 స్థానాలు వస్తాయని తమకు సమాచారం వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, సమస్యలు, సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫామ్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

- Advertisement -

రైతు పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఎక్కువ వస్తువులను తక్కువ ధరలకు ఇస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని అన్నారు. ఏపీ సీఎం ఎవరయినా వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

యూటీ గురించి మాట్లాడే వారి మెదడు చిన్నగా ఉన్నట్లే అని విమర్శించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం స్పందించారు. కేంద్రపాలిత ప్రాంతం అనే అంశమే లేదన్నారు. గతంలో కేటీఆర్ హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News