Health Benefits: మన శరీరంలో సహజంగానే ఉండే రక్షణ వ్యవస్థను రోగ నిరోధక శక్తి అంటారు. ఈ శక్తి బలహీనంగా ఉంటే చిన్న జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు తరచూ వస్తుంటాయి. కానీ సహజ పద్ధతుల్లో కొన్ని చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే మన ఇమ్యూనిటీ బలపడుతుంది. అందులో ఒకటి ఇంగువలో బెల్లం కలిపి తినడం.
ఇంగువ అంటే మన ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే ఒక ముఖ్యమైన దినుసు. దీన్ని వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా వాడతారు. ఇంగువలో ఉండే యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. పైగా, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
ఇక బెల్లం గురించి చెప్పుకుంటే.. అది సహజమైన తీపి పదార్థం. చక్కెర కంటే బెల్లం చాలా ఆరోగ్యకరం. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చే తోడు రక్తహీనతను తగ్గిస్తాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో బెల్లం ఎంతో ఉపయోగకరం.
Also Read: Apple Seeds: నమ్మలేని నిజం.. యాపిల్ విత్తనాలు తింటే ప్రాణానికే ప్రమాదమా?
ఇప్పుడీ రెండింటిని కలిపి తింటే కలిగే లాభాలు మరింత అద్భుతంగా ఉంటాయి. రోజూ కొంచెం ఇంగువను తీసుకుని దానిలో చిన్న ముక్క బెల్లం కలిపి తింటుంటే రోగ నిరోధక శక్తి సహజంగానే పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం వంటి సీజన్లలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరం రక్షణ పొందుతుంది.
అంతేకాకుండా, ఇంగువ-బెల్లం కలయిక శరీరంలో జీర్ణక్రియను సక్రమంగా పనిచేయేలా చేస్తుంది. అజీర్ణం, కడుపులో గాలి, పొట్ట ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి. మనకు తిన్న ఆహారం సులభంగా జీర్ణమై శరీరానికి అవసరమైన శక్తి ఇస్తుంది.
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఈ చిన్న అలవాటు పాటిస్తే శరీరానికి కావలసిన సహజ రక్షణ ఏర్పడుతుంది. రసాయన మందుల మీద ఆధారపడకుండా మనం సులభంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. పెద్దలు ఎందుకూ ఇంగువను “ఔషధాల రాణి” అంటారో ఇక్కడి నుంచే అర్థమవుతుంది.
మరి, మనం రోజూ చిన్న ముక్క బెల్లంతో ఇంగువ తినడాన్ని అలవాటు చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి, ఏ సీజనల్ వ్యాధి వచ్చినా మన శరీరం ధైర్యంగా ఎదుర్కొనేలా మారుతుంది. ఇది తేలికైనదే కానీ శరీరానికి ఇచ్చే లాభాలు మాత్రం చాలా గొప్పవి.