Banana For Hair: అరటిపండు, ఒక రుచికరమైన పండు మాత్రమే కాకుండా చాలా ప్రయోజనకరమైనది. ఇందులో ఉండే విటమిన్లు ,మినరల్స్ మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి. కాబట్టి మీరు దీన్ని జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగించవచ్చు. దీని నుండి తయారైన హెయిర్ మాస్క్‌లు జుట్టు పొడిబారడం, పడిపోవడం, చుండ్రు వంటి అనేక రకాల జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. మరి బనానా హెయిర్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు , దానిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు:
తేమను అందిస్తుంది- అరటిపండులో ఉండే పోషకాలు జుట్టును లోతుగా మాయిశ్చరైజ్ చేసి, జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
జుట్టును బలపరుస్తుంది- అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు పాడవకుండా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది- అరటిపండులో విటమిన్ B6 ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
చుండ్రును తగ్గిస్తుంది- అరటిపండులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి .
జుట్టును మృదువుగా చేస్తుంది- అరటిపండులో సహజమైన కండిషనర్లుగా పని చేసే అంశాలు ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా చిట్లకుండా చేస్తాయి.
అరటిపండు నుండి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
మీరు మీ జుట్టు సమస్యలను బట్టి అరటిపండును వివిధ రకాల హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
1. అరటి , తేనె హెయిర్ మాస్క్: పండిన అరటిపండును మెత్తగా చేసి, దానికి ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఈ మాస్క్ జుట్టుకు తేమను అందించి వాటిని మృదువుగా చేస్తుంది.
2. అరటిపండు, పెరుగు హెయిర్ మాస్క్: పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి రెండు చెంచాల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా తగ్గిస్తుంది.
3. అరటిపండు, ఎగ్ హెయిర్ మాస్క్ :పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి గుడ్డు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు , తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. అరటి, అలోవెరా హెయిర్ మాస్క్: పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఈ మాస్క్ స్కాల్ప్‌కు పోషణ అందించడంతో పాటు జట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అరటి హెయిర్ మాస్క్ ఎలా ఉపయోగించాలి ?
మీ జుట్టును కడిగి ఆరబెట్టండి – హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, మీ జుట్టును తేలికపాటి షాంపూతో వాష్ చేసి ఆరబెట్టండి.
మిశ్రమాన్ని సిద్ధం చేయండి- మీ అవసరాన్ని బట్టి అరటి హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయండి.
జుట్టు, స్కాల్ప్ మీద అప్లై చేయండి- తయారుచేసిన మిశ్రమాన్ని మీ జుట్టు , స్కాల్ప్ మీద పూర్తిగా అప్లై చేయండి.
30 నిముషాల పాటు వదిలివేయండి – మిశ్రమాన్ని మీ జుట్టు మీద 30 నిమిషాలు ఉంచండి.
గోరువెచ్చని నీటితో కడగాలి – 30 నిమిషాల తర్వాత, మీ జుట్టును గోరువెచ్చని నీటితో బాగా వాష్ చేయండి.
Also Read: పొరపాటున కూడా.. అమ్మాయిలు ఈ 5 వస్తువులను వాడకూడదు తెలుసా ?
ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి:
అలెర్జీ పరీక్ష- మీకు అరటిపండు లేదా మరేదైనా పదార్ధానికి అలెర్జీ ఉంటే, హెయిర్ మాస్క్‌ను అప్లై చేసే ముందే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.
రంగు జుట్టు కోసం – మీరు రంగు జుట్టు కలిగి ఉంటే, అరటి హెయిర్ మాస్క్‌ని ఉపయోగించే ముందు మీ హెయిర్ స్టైలిస్ట్‌ని సంప్రదించండి.
క్రమం తప్పకుండా ఉపయోగించండి- మెరుగైన ఫలితాల కోసం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు అరటిపండు హెయిర్ మాస్క్ ఉపయోగించండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.