Ram Charan : ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇండియాలో కనిపిస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సెలబ్రిటీలు కొంతమంది మతాన్ని మారడం, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనేవి చర్చకు దారి తీస్తూ ఉంటాయి. ఇక చాలామంది సినీ ప్రముఖులు ముస్లింలు అయినప్పటికీ హిందువుల పండుగలను జరుపుకోవడం, హిందువులు అయినప్పటికీ ముస్లిం దర్గాలను దర్శించడం అనేది సర్వసాధారణం. కానీ తాజాగా రామ్ చరణ్ (Ram Charan) ఏకంగా అయ్యప్ప మాలను ధరించి కడప దర్గాను సందర్శిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన ఇలా చేయడానికి గల కారణం ఏంటి? రామ్ చరణ్ దర్గాను సందర్శించడానికి కారణమైన వ్యక్తి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…
సాధారణంగా ముస్లింలు మక్కాను అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. చచ్చేలోపు ఒక్కసారైనా మక్కాను దర్శించాలని కలలు కంటారు. అలాంటి మక్కా తర్వాత అత్యంత పవిత్రంగా భావించే దర్గా కడపలో ఉంది. దీన్ని అమీన్ పీర్ దర్గా అని పిలుస్తారు. ఇక ప్రతి ఏడాది ఇక్కడ జరిగే ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో జనాలు తరలివస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. ఇక ఈ వేడుకలకు దర్గా పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేన్.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. అందులో భాగంగా కడప నగరంలోనే అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రామ్ చరణ్ (Ram Charan) గెస్ట్ గా వెళ్లబోతున్నారు. ఈరోజు అక్కడ జరగబోతున్న ముషాయిరా కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరవుతున్నారు.
కానీ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన దర్గాను సందర్శించడానికి గల కారణం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) కు ఇచ్చిన మాట అని తెలుస్తోంది. విషయం ఏమిటంటే.. గత ఏడాది ఏఆర్ రెహమాన్ ఈ వేడుకలకు 2024లో రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకొస్తానని మాట ఇచ్చారట. ఆయన తన మాట ప్రకారం రామ్ చరణ్ ని ఈ వేడుకలకు రావాలని ఆహ్వానించగా, టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ ఈవెంట్లో పాల్గొంటానని మాటిచ్చారట. మొత్తానికి ఇద్దరూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే ఈ దర్గా ఉత్సవాలలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో, చెప్పులు లేకుండానే పాల్గొనన్నట్టుగా తెలుస్తోంది. ఇదన్నమాట రామ్ చరణ్ దర్గా సందర్శన వెనక ఉన్న స్టోరీ. కాగా చెర్రీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.