BigTV English

beauty tips with mango: మామిడి పండుతో ఫేస్ ప్యాక్.. అదిరిపోయే చర్మకాంతి మీ సొంతం

beauty tips with mango: మామిడి పండుతో ఫేస్ ప్యాక్.. అదిరిపోయే చర్మకాంతి మీ సొంతం
beauty tips with mango
beauty tips with mango

beauty tips with mango (beauty tips for women): మామిడికాయలు అంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్చువచ్చేది పండ్లలో రారాజైన మామిడికాయ మాత్రమే. మామిడి కాయల్లో ఉండే రకాలు మరే పండ్లలోను ఉండవనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే వేసవికాలంలో దొరికే మామిడి కాయలను ఎంతో ఇష్టం ఆస్వాదిస్తుంటారు. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చల్లటి గాలికి కూర్చుని చల్లటి మామిడి కాయలను తింటుంటే ఆ అనుభూతి స్వర్గంలా ఉంటుందనే చెప్పాలి. అయితే ఎండాకాలంలో దొరికే మామిడి పండ్లు కేవలం రుచిలో మాత్రమే కాదు.. వీటితో బోలెడన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఎన్నో సుగుణాలున్న మామిడి పండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది.


మామిడి పండు గుజ్జును సౌందర్య పరిరక్షణకు ఉపయోగించటం వలన మెరిసే మోమును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎండలో తిరగడం వల్ల ముఖంపై ఏర్పడే ట్యాన్ ను మామిడి పండు గుజ్జుతో తొలగించుకోవచ్చు. కేవలం చర్మ సంరక్షణే కాకుండా, జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు. మరి ఎలాగో చేయాలో తెలుసుకుందాం.

ముల్తానీతో మ్మాంగో ఫేస్ ప్యాక్:


మామిడి కాయలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో చర్మాన్ని రక్షించుకునేందుకు మామిడిపండు తోడ్పడుతుంది. అయితే ఫేస్ ప్యాక్ వేసుకునే సమయంలో మామిడి పండులో ఉండే గుజ్జును మాత్రమే ఉపయోగించాలి. గుజ్జు తీసేటప్పుడు తొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను ఫేస్ ప్యాక్ లో తొక్కను రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మామిడి పండు తొక్కపై తెల్ల సోన ఉండడం ద్వారా అది ఫేస్ పై పడితే చర్మానికి దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం గుజ్జును మాత్రమే వాడాలి. అనంతరం గుజ్జును మెత్తగా చేసుకుని దానికి సరైన మోతాదులో ముల్తానీ మట్టిని కలుపుకోవాలి. ఆ మొత్తాన్ని మంచి పేస్ట్ లా చేసుకుని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని ఆపై గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ చల్లని నీటితో ప్యాక్ తొలగించుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఓట్స్ మీల్ ప్యాక్ :

చర్మానికి కాంతితో పాటు ఆరోగ్యం కూడా అవసరం. అయితే మామిడి గుజ్జును, ఓట్స్ మీల్ తో కలిపి తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ఈ ఓట్స్ మీల్ ప్యాక్ కోసం 7, 8 బాదాం పప్పులను నీటిలో నానబెట్టి పొట్టు తీయాలి. అనంతరం వాటికి రెండు టీ స్పూన్లు పాలు, కొద్దిగా ఓట్స్ , నీళ్లు , ముల్తానీ మట్టి, ఒక మామిడి పండు గుజ్జు కలిపి మొత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఓ పావు గంట పాటు ఉంచుకుని కడిగేయాలి. దీన్ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

ట్యాన్ రిమూవింగ్ లో బెస్ట్ వన్:

ఎండాకాలంలో దొరికే ఈ పండుతో.. ట్యాన్ ని రిమూవ్ చేసుకోవచ్చు. దీని కోసం మామిడిపండు గుజ్జులో నాలుగు టేబుల్ స్పూన్లు సెనగపిండి, 4, 5 బాదాం పప్పుల పొడి, తేనె కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన శరీర భాగాల్లో అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ట్యాన్ పూర్తిగా తొలగిపోతుంది.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×