E-Paper
Advertisement

నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ
Advertisement

Chicken Karam Podi: మనం రోజూ తినే మామూలు కారాలు, పచ్చళ్లకు కొంచెం భిన్నంగా రాత్రి పూట లేదా మధ్యాహ్నం భోజనంలోకి ఏదైనా కొత్త టేస్ట్ ట్రై చేయాలనిపిస్తే.. చికెన్ కారం పొడి ఒక అద్భుతమైన ఆప్షన్. వేడి వేడి అన్నంలో.. కొద్దిగా ఈ పొడి వేసుకుని, నెయ్యి లేదా నూనె వేసుకుని తింటే.. అమృతంలా ఉంటుంది. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా ఇది మంచి కాంబినేషన్‌గా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే వాటిలో కల్తీ భయం ఉంటుంది కాబట్టి, ఎంతో హైజీనిక్‌గా మన చేతులతోనే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

చికెన్: 250 గ్రాములు

Advertisement

ఎండుమిర్చి: 15 నుంచి 20

ధనియాలు: 3 టేబుల్ స్పూన్లు

Advertisement

జీలకర్ర: 1 టేబుల్ స్పూన్

మిరియాలు: 1 టీస్పూన్

లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క: చిన్న ముక్కలు

వెల్లుల్లి రెబ్బలు: 15 నుంచి 20

కరివేపాకు: రెండు రెమ్మలు

పసుపు: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరి పడా

నూనె: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి.తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి,ఈ చికెన్ ముక్కలను వేయాలి.ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి చికెన్ లోని నీరంతా ఇంకిపోయి, ముక్కలు బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలు పూర్తిగా చల్లారాలి.

2. ఇప్పుడు అదే ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేసి మంటను.. లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా వేయించాలి. చివరగా కరివేపాకు వేసి కరకరలాడే.. వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.

3. ముందుగా వేయించి పెట్టుకున్న.. మసాలా దినుసులు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్ లో..మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే.. వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి.మిక్సీని పల్స్ మోడ్ లో తిప్పుతూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

4. గ్రైండ్ చేసిన చికెన్ కారం పొడిని.. ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా ఆరేవరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక పొడి ఎయిర్ టైట్ గాజు డబ్బాలో..స్టోర్ చేసుకుంటే.. నెల రోజుల పాటు తాజాగ మంచి సువాసనతో ఉంటుంది.

Also Read: హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది

కిచెన్ టిప్స్ :

చికెన్ వేయించేటప్పుడు నీరు అస్సలు ఉండకూడదు. లేదంటే పొడి త్వరగా పాడైపోతుంది.

వెల్లుల్లి వేయడం వల్ల పొడికి మంచి సువాసన, టేస్ట్ వస్తాయి.

వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా ఈ పొడి వేసుకుని తింటే ఆ రుచే వేరు!

ఈ వీకెండ్‌లో మీ ఇంట్లో ఈ ట్రెండింగ్ చికెన్ కారం పొడిని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులను కొత్త టేస్ట్ రుచి చూపించండి.

Related News

హైదరాబాద్ స్టైల్ దమ్ కా కీమా..ఇలా చేస్తే రుచి అద్భుతం!

సాధారణ మటన్ కర్రీ కాదండోయ్.. ఈ స్పెషల్ తలావా గోష్త్ టేస్ట్ వేరే లెవల్ అంతే!

సాయంత్రం పూట వేడి వేడి టీతో..ఈ చిట్టి మురుకులు సూపర్ కాంబినేషన్!

మటన్, చికెన్ కూడా వద్దంటారు.. పల్లెటూరి స్టైల్ పనస పొట్టు కూర అంత బాగుంటుంది మరి!

గుత్తి దొండకాయ కూర ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు!

జన్యుపరంగా కొలెస్ట్రాల్ ముప్పు ఉన్నా తగ్గించుకోవచ్చా? చెన్నై అధ్యయనం ఏం చెబుతోంది?

డేటింగ్ యాప్స్‌లో కొత్త ట్రెండ్.. అందం, ఫిట్‌నెస్ కాదు ఇది ముఖ్యం

Big Stories

Advertisement
×