Amla Water Steam: ఉసిరి నీటిని ఆవిరి పట్టడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. ఈ నేచురల్ రెమెడీ ముఖ్యంగా చలికాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. ఉసిరి నీటిని ఆవిరి పట్టడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
జలుబు లేదా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉసిరి నీటిని ఆవిరి పట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరిలో ఉండే లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా దీని యొక్క ఆవిరి జలుబు సమయంలో ముక్కును క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని శుభ్రంగా,మెరిసేలా చేస్తుంది:
ఉసిరి నీటితో ఆవిరి పట్టడం వల్ల చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవిరిని తీసుకోవడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడుతుంది. అంతే కాకుండా ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని టాక్సిన్స్‌ని తొలగించి, చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ఇది మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
తలనొప్పి, ఒత్తిడి నుండి ఉపశమనం:
ఉసిరి నీటిని ఆవిరి పట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. దీని కూలింగ్ ఎఫెక్ట్ తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆవిరి తీసుకోవడం వల్ల శరీరం , మనస్సు రిలాక్స్ అవుతాయి, తద్వారా మీరు మరింత రిఫ్రెష్‌గా ఉంటారు.
Also Read: పెరుగుతో.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ
ఉసిరి నీటి ఆవిరిని ఎలా తీసుకోవాలి ?
ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని ఉసిరి ముక్కలను వేయాలి.
ఉసిరి యొక్క పోషకాలు నీటిలో బాగా కలిసేలా బాగా ఉడకబెట్టండి.
ఇప్పుడు ఒక టవల్ తీసుకొని, మీ తలను కప్పి, పాత్ర దగ్గర వంగి ఆవిరిని పీల్చుకోండి.
ఆవిరి పీల్చేటప్పుడు నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి.
ఉసిరి నీటిని ఆవిరి తీసుకోవడం అనేది మీ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడానికి సులభమైన, సహజమైన మార్గం. తరుచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రెమెడీ చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.