BigTV English

CM Revanth Reddy: సైబర్ దాడులను ఎదుర్కొనేలా గూగుల్ సేఫ్టీ సెంటర్

CM Revanth Reddy: సైబర్ దాడులను ఎదుర్కొనేలా గూగుల్ సేఫ్టీ సెంటర్

బడ్జెట్‌లో హైడ్రాకు రూ. 200 కోట్లు కేటాయింపు ( 01-12-2024 ఆదివారం ) ( ఉద్యోగులకు మేలు )

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆదేశాలిచ్చారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. సో ఈ వెసులుబాటుతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు రిలీఫ్ దొరకనుంది.


( 01-12-2024 ఆదివారం ) ( నయా ఉస్మానియా దవాఖానా )

గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సంబంధించి సర్వే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 1న ఆదేశించారు. ఉస్మానియా హాస్పిటల్ పనులకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చుట్టూ రోడ్లపై కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు.. తాగునీరు, కరెంట్, డ్రైనేజీ పనుల కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ హెరిటేజ్ లిస్టులో ఉండడంతో గోషా మహాల్ స్టేడియంలో నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. గోషా మహాల్‌లో దాదాపు 32 ఎకరాల్లో పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్త ఆసుపత్రిని రాబోతోంది. ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలి చేయాలని అధికారులకు గతంలో సీఎం ఆదేశించారు కూడా. దీనికి ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీసు శాఖకు కేటాయించాలన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను బేరేజు వేసుకుని కొత్త ఆసుపత్రికి రూప కల్పన చేయాలన్నారు.

( 02-12-2024 సోమవారం ) ( ఇండస్ట్రియల్ బూస్టప్ )

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 2న ప్రారంభించారు. కోకోకోలా, థమ్స్​అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో ఈ ప్లాంట్ ను నిర్మించింది. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ప్లాంట్ పూర్తి చేశారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ పదినెలల్లో చేసి చూపెట్టిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు.

( 02-12-2024 సోమవారం ) ( ఆరోగ్య తెలంగాణ కోసం )

ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల సందర్భంగా ఈనెల 2న ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ పారా మెడికల్ కాలేజీలను వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్తగా నియమితులైన 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌కు నియామక పత్రాలు అందించారు. 108 కోసం 136 అంబులెన్స్ ​లను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అలాగే 102 కోసం 77 అంబులెన్స్​ లకు ప్రారంభించారు.

( 02-12-2024 సోమవారం ) ( దేశంలోనే తొలిసారి-మైత్రి క్లినిక్స్ )

ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగానే రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన, సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రిట్రాన్స్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. ట్రాన్స్ జెండర్ ల సమస్యలు చాలా ఉంటాయి. వారికి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉంటుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. సమాజంలో ఒక భాగమైన వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ లను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో ట్రాన్స్‌జెండర్‌ హెల్త్‌కేర్‌పై శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఒక డాక్టర్, కౌన్సెలర్, కమ్యూనిటీ పర్సన్‌గా ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉంటారు.

(02-12-2024 సోమవారం ) ( CM రిలీఫ్ ఫండ్స్ రికార్డులివే )

సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 830 కోట్లను పేదల వైద్య ఖర్చుల కోసం విడుదల చేసింది. సీఎం రేవంత్ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా 1.66 లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరింది. 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద 2,400 కోట్లు సాయం అందించింది. అంటే సగటున ఏడాదికి కేవలం 480 కోట్లు మాత్రమే. కానీ.. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే 830 కోట్లను మానవతా దృక్పథంతో సాయం చేసింది. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని ట్రీట్​మెంట్లు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే.. ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకు సర్కార్ సాయం అందిస్తోంది. వీటిలో ఎక్కువగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, ట్రీట్​మెంట్లే ఉన్నాయి.

పిల్లల ఆరోగ్య విషయంలో రేవంత్ ప్రభుత్వం మరింత మానవతాదృక్పథంతో వెళ్తోంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే హాస్పిటల్స్ కు ఎల్​వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పుట్టుకతోనే ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆరేళ్ల లోపలే ఆపరేషన్లు చేయించాల్సి ఉంటుంది. దీని కోసం లక్షలు ఖర్చు అవుతాయి. పేద కుటుంబాలు డబ్బుల్లేక ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తదని, పిల్లలకు మాత్రం ట్రీట్​మెంట్లు అందించాలని ఇటీవల ఆదేశించారు. ఆ ప్రకారమే సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి.

( 02-12-2024 సోమవారం ) ( ట్రాఫిక్ చిక్కులకు చెక్ )

హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్‌ వాటర్‌ సంప్‌ పనులను సీఎం రేవంత్‌ రెడ్డి ఈనెల 2న పరిశీలించారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చొరవకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. వరద నివారణపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్‌ జామ్‌లను తగ్గించవచ్చన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైయిన్‌ వాటర్‌ సంప్‌ల డిజైన్‌ మార్చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ దగ్గర రెయిన్‌ వాటర్‌ సంపులను నిర్మించాలని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ తిప్పలు తప్పబోతున్నాయి.

( 03-12-2024 మంగళవారం ) ( హైడ్రాకు మరిన్ని పవర్స్ )

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా రంగంలోకి దిగిన హైడ్రాకు ప్రభుత్వం అన్ని రకాలుగా వనరులు సమకూరుస్తోంది. తాజాగా హైడ్రాకు నిధులు రిలీజ్ చేసింది. నగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్క్‌ల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తోన్న హైడ్రాకు 50కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ ఈనెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కార్యాలయం నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలుతోపాటు ఇప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం ఈ నిధులు ఖర్చు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడ్జెట్‌లో హైడ్రాకు 200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజాగా 50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరింది. ప్రజల పనులు స్పీడ్ గా జరగాలి.. ప్రభుత్వ ఖర్చులు ఆదా చేయాలి.. అర్హులను పక్కాగా గుర్తించాలి.. అసలైన పేదలకే ప్రయోజనం దక్కాలి. అటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలి.. ఇదే కాన్సెప్ట్ తో ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పనులు చేపట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అసలైన అర్హులను గుర్తించేలా ఇందిరమ్మ యాప్ (04-12-2024 బుధవారం )

ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 4న తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ లో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్‌ కు పునాది రాయి వేశారు. పలు ఫారెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కొత్త వాహనాలను ప్రారంభించారు.

(04-12-2024 బుధవారం) ( గూగుల్ డీల్స్ )

దేశంలోనే మొట్టమొదటి గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు గూగుల్‌తో ఈనెల 4న రేవంత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. గూగుల్‌ ప్రధాన సమాచార అధికారి రాయల్‌ హన్సెన్‌ ఆధ్వర్యంలోని టీం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. అమెరికా బయట అతిపెద్ద ఆఫీస్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ ప్రపంచంలోనే ఐటీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా అందరి దృష్టినీ ఆకర్షించేలా ప్రజాప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఆసియా పసిఫిక్‌ జోన్లో ఇప్పటి వరకు టోక్యోలో మాత్రమే గూగుల్‌ ఇంజనీరింగ్‌ సేఫ్టీ సెంటర్‌ ఉంది. సీఎం రేవంత్‌ అమెరికా పర్యటనలో గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో ఈ సెంటర్‌ హైదరాబాద్‌కు వచ్చింది. దేశంలోనే తొలి గూగుల్‌ పవర్డ్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ఛాన్సెస్ పెరిగాయి. గూగుల్ సేఫ్టీ సెంటర్ ఎందుకంటే సైబర్ దాడులను అరికట్టేందుకు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా ఏర్పాటు చేస్తారన్న మాట. గూగుల్‌ నిర్ణయంతో సైబర్‌ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన చాలా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతాయని.. ఫలితంగా వేలసంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయంటున్నారు.

(04-12-2024 బుధవారం) ( యువ వికాసం దిశగా )

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 4న యువ వికాసం సభకు సీఎం హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ ​రెడ్డి పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. సుమారు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ రోడ్లకు 600 కోట్లు, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి 77 కోట్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల ఏర్పాటుకు 26 కోట్లు, నర్సింగ్​ కాలేజీకి 10 కోట్లు కేటాయించారు. 82 కోట్లతో పెద్దపల్లిలో చేపట్టనున్న బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 51 కోట్లతో జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి బస్​ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ స్కూల్, పెద్దపల్లి మున్సిపాలిటీకి 15 కోట్లు, సుల్తానాబాద్ కు ​5 కోట్లు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయానికి 5 కోట్లు, మహిళ సంఘాల సంక్షేమానికి 5 కోట్లు మంజూరు చేశారు. గ్రూప్ 4 లో ఎంపికైన 9 వేల మందికి ఇదే సభలో అపాయింట్ మెంట్ లెటర్లు అందించారు.

(04-12-2024 బుధవారం) ( ఇక క్షణాల్లో అనుమతులు )

నూతన భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థ బిల్డ్ నౌ ను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేనుంది. దీనికి సంబంధించిన యాప్ బ్రోచర్ ను మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియట్ లో రిలీజ్ చేశారు. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటెనీ వ్యవస్థగా నిలవనుంది. అనుమతులు, డ్రాయింగ్, స్క్రూటెనీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గించనున్నారు. ప్రస్తుతం అమలవుతున్న టీజీబీపాస్‌లో ఇన్‌స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో వేర్వేరుగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా ఆక్యూపెన్సీ సర్టిఫికెట్, బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్, ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్, అక్రమ నిర్మాణాలకు నోటీసుల జారీ వరకు అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఉండబోతోంది. ప్రస్తుత వ్యవస్థ టీజీబీపాస్‌లో 2నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. కానీ బిల్డ్ నౌ లో ఐదు నిమిషాల్లోపే పరిశీలన పూర్తవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కియోస్క్ లతో స్క్రూటెనీ చేస్తారు.

(05-12-2024 గురువారం ) ( ఇకపై హ్యాండ్లూమ్ మార్క్స్ )

బంగారానికి హాల్‌ మార్క్, వస్తువులకు ట్రేడ్‌ మార్క్‌ మాదిరే తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్‌షీట్లు వంటి వస్త్రాలకు ఇకపై హ్యాండ్లూమ్‌ మార్క్‌లు కనిపిస్తాయి. స్వచ్ఛమైన చేనేతకు అది ముద్రగా ఉపయోగపడడంతోపాటు దాని ద్వారా వస్త్రం రకం, దాన్ని తయారు చేసిన కార్మికుని సమాచారం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాల విశిష్టతను చాటేలా వాటికి హ్యాండ్లూమ్‌ మార్క్‌ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. చేనేత అభయహస్తం కింద హ్యాండ్లూమ్‌ మార్క్‌ ట్యాగ్‌లను రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేయడంతోపాటు వీటిని వాడినందుకు ఆర్థికసాయం సైతం అందించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 59,425 మంది చేనేత కార్మికులున్నారు. 299 చేనేత సహకార సంఘాల కింద అధికశాతం పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను రాష్ట్ర చేనేత సహకార సంఘానికి అమ్ముతున్నారు. ప్రసిద్ధ చేనేత రకాల వస్త్రాలను పరిరక్షించడంతో పాటు వాటి అమ్మకాలు పెరిగేలా, కార్మికులకు ఉపాధి పెంచేందుకు చేనేత శాఖ ఈ హ్యాండ్లూమ్‌ మార్క్‌ పథకానికి రూపకల్పన చేసింది.

(05-12-2024 గురువారం ) (కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం)

ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీలేని పోరాటం చేస్తోంది. కృష్ణా జలాల నీటి కేటాయింపులపై ఈనెల 5న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు జరిగిన వాదనలు జరిగాయి. ట్రైబ్యునల్‌ ముందు ఎక్కువ రోజులు వాదనలు కొనసాగేలా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదించింది. దీనివల్ల తుది అవార్డు రావడంలో జాప్యం జరిగి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కేటాయింపులను ఎక్కువ సంవత్సరాలు వినియోగించుకోవచ్చని, అనధికారిక నిర్మాణాలు కొనసాగించవచ్చన్నది ఆంధ్రప్రదేశ్‌ వ్యూహంగా ఉందని వాదించింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నది.

(05-12-2024 గురువారం ) ( ఇందిరమ్మ ఇండ్ల యాప్ రెడీ )

ఆత్మ గౌరవంతో బతకాలనేది పేదల కల అని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటీ, కపడా, ఔర్‌ మకాన్‌ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మ గౌరవంగా భావిస్తారని తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమన్నారు సీఎం. ఇందుకోసం యాప్ తీసుకొచ్చారు. మొదట నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నారు. ఇందుకోసం అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చారు. ఇందులో ఎంట్రీ చేసి ఐడెంటిఫై చేస్తారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఈనెల 6న ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన SDRF స్టాల్ ​ను సందర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్​ కు 35 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు.

( 06-12-2024 శుక్రవారం ) ( హోంగార్డులకు శుభవార్త )

హోంగార్డులు నిస్వార్థ సేవకులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులతో సమానంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు సీఎం. హోంగార్డులకు రోజువారి వేతనం 1000, వీక్లీ పరేడ్ అలవెన్స్ లు 200 రూపాయలు ఇవ్వనున్నారు. అంతేకాదు హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తారు.

( 06-12-2024 శుక్రవారం ) ( ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు )

ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో వెలుగు నింపనుంది. గోషామహల్‌ స్టేడియంలో ట్రైనింగ్ పూర్తి చేసిన 44 మంది ట్రాన్స్‌ జెండర్లకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌ జెండర్లను ఎంపిక చేసింది. సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్‌జెండర్లకు బుధవారం ఫిజికల్‌ ఈవెంట్‌ నిర్వహించింది. అందులో 44 మంది ఎంపికైనట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. వీరు ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించనున్నారు. సమాజంలో చిన్న చూపు చూసే తమపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలకు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు ట్రాన్స్ జెండర్లు.

( 07-12-2024 శనివారం ) ( క్రీడలకు ప్రాధాన్యం )

రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో సీఎం కప్‌-2024 పోటీలు 7న మొదలయ్యాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 36 క్రీడా విభాగాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. యువత పెడధోరణులకు వెళ్లకుండా సీఎం స్పోర్ట్స్ వైపు వారందరినీ మళ్లిస్తున్నారు. ఇప్పటికే క్రీడల అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. సౌకర్యాలు పెంచుతున్నారు. నిధులు కేటాయిస్తున్నారు.

( 07-12-2024 శనివారం ) ( ఎన్నాళ్లో వేచిన ఉదయం )

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌ ఆరంభానికి నోచుకుంది. గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన యాదాద్రి ప్లాంట్ ను రేవంత్ వచ్చాక పనుల్లో స్పీడ్ పెంచారు. 4 వేల మెగావాట్ల కెపాసిటీతో నిర్మించిన ఈ పవర్ ప్లాంట్ ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం రెండో యూనిట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో సీఎం రేవంత్‌ చేతుల మీదుగా దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని యూనిట్‌లను పూర్తి చేసి 4 వేల మెగావాట్ల కరెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా స్పష్టమైన ప్రణాళికతో ఉంది రేవంత్ ప్రభుత్వం. అటు 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభించారు. 2007లో ప్రాజెక్టు పనులను ప్రారంభించగా బీఆర్ఎస్ హయాంలో చివరి 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దీన్ని ప్రయారిటీగా టేకప్ చేసి ప్రారంభించింది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×