Ice On Face: ప్రతి ఒక్కరూ తమ చర్మం అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడతారు. కానీ బయట రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతే కాకుండా వీటిని కొనడానికి కూడా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది. ఐస్ క్యూబ్స్ కూడా చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా ముఖంపై ఐస్ అప్లై చేయడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి. అనేక సమస్యల నుండి కూడా ఉపశమనం కూడా లభిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఐస్ క్యూబ్స్‌ను గ్లోయింగ్ స్కిన్ ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మొటిమలను తగ్గిస్తుంది:
ముఖానికి ఐస్ అప్లై చేయడం వల్ల బ్లష్ లేదా హైలెటర్ లేకుండా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అంతే కాకుండా ఐస్ తో ముఖాన్ని తరచుగా రుద్దడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా మీరు సహజమైన గ్లోయింగ్ స్కిన్ పొందేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
డార్క్ సర్కిల్స్:
డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దోసకాయ రసాన్ని కొద్దిగా రోజ్ వాటర్‌లో కలిపి ఐస్ క్యూబ్ తయారయిన తర్వాత కళ్లు, ముఖంపై అప్లై చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇలా కొన్ని రోజులు చేసినా కూడా మీరు డార్క్ సర్కిల్స్ సమస్య నుండి ఈజీగా బయటపడతారు. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఐస్ క్యూబ్ లను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మొటిమలు రాకుండా చేయడంలో కూడా ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయి. మచ్చలను కూడా తగ్గిస్తాయి.
Also Read: అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి
కాఫీ ఐస్ క్యూబ్:
కాఫీ పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాఫీని పౌడర్ ను కాస్త వాటర్‌లో వేసి క్యూబ్‌లను తయారు చేసి ముఖానికి వాడటం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఇది ముఖ కాంతిని మెరుగ్గా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్ ఐస్ క్యూబ్:
రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్‌ను నార్మల్ వాటర్‌లో కలిపి మిక్స్ చేయండి. తర్వాత దీనిని క్యూబ్ లాగా చేసి వీలైనప్పుడల్లా ముఖానికి అప్లై చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సహజ సౌందర్యం కోసం రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.