BigTV English

Vidaamuyarchi day 1 collections : ‘పట్టుదల’ ఫస్ట్ డే కలెక్షన్స్… బజ్ లేని అజిత్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా ?

Vidaamuyarchi day 1 collections : ‘పట్టుదల’ ఫస్ట్ డే కలెక్షన్స్… బజ్ లేని అజిత్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా ?

Vidaamuyarchi day 1 collections : 200 కోట్ల భారీ బడ్జెట్ తమిళ మూవీ ‘పట్టుదల’ (Pattudala) తాజాగా థియేటర్లలోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ఈ సినిమా ‘విదామూయార్చి’ (Vidaamuyarchi) పేరుతో తమిళంలో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం ‘పట్టుదల’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసుకుందాం పదండి.


‘పట్టుదల’ ఫస్ట్ డే కలెక్షన్స్ 

అజిత్ కుమార్, త్రిష జంటగా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘విదాముయార్చి’. ఈ మూవీ ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే తమిళంలో అజిత్ కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా, ఈ మూవీకి అక్కడ  మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగులో మాత్రం సినిమా జీరో బజ్ తో రిలీజ్ అయింది. తమిళనాడులోని మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ తెలుగులో మాత్రం డీలా పడింది. మొదటిరోజు ఈ మూవీ భారత దేశంలో రూ.22 కోట్ల నెట్ వసూలు చేసినట్టు సమాచారం. అయితే గతంలో అజిత్ చేసిన ‘తునివు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను మాత్రం ‘పట్టుదల’ అధిగమించలేకపోవడం గమనార్హం. ‘తునివు’ మూవీకి మొదటి రోజు రూ. 24.4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.


200 కోట్ల సినిమా 22 కోట్ల కలెక్షన్స్…

అజిత్ కుమార్ ‘విదాముయార్చి’ మూవీతో తెరపైకి రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చారు. ఇందులో అర్జున్ సర్జా, త్రిష రెజినా, ఆరవ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ముందుగా ఈ మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ‘పట్టుదల’ మూవీ రిలీజ్ ఆలస్యమైంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు అజిత్ పారితోషకమే 110 కోట్ల నుంచి 120 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే తెలుగులో మాత్రం ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నెగెటివ్ టాక్ నడుస్తోంది.

విమర్శకులు సినిమాలో అజిత్ నటన మాత్రమే బాగుందని అంటున్నారు. ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్, కథనం బోరింగ్ గా ఉన్నాయని టాక్. అయినప్పటికీ అజిత్ స్టార్ పవర్ కారణంగా ఈ మూవీ కోలీవుడ్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. కానీ తెలుగులో ఈ మూవీని ప్రమోట్ చేయడానికి కూడా కనీసం నిర్మాతలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దానికి తోడు నెగిటివ్ రివ్యూలు రావడంతో, అసలు తెలుగులో ఈ మూవీ రిలీజ్ అయిందా లేదా ? అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు మూవీ లవర్స్.

మరోవైపు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ఈరోజు విడుదలైంది. కోలీవుడ్లో అజిత్ స్టార్ హీరో అయినప్పటికీ, తెలుగులో కనీసం ప్రమోషన్స్ కూడా లేకుండా ఆయన సినిమా ఆడటం కష్టమే. ‘తండేల్’ మూవీకి ఉన్న బజ్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ‘పట్టుదల’ మూవీ థియేటర్లలో ఆడడం కష్టమే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×