Jaggery For Skin: భోజనం తర్వాత బెల్లం తినమని పెద్దలు సలహా ఇవ్వడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. బెల్లం ఆరోగ్యానికి, మీ చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా బెల్లం మనకు అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. దీంతో పాటు.. ముఖంపై మచ్చలను కూడా తొలగిస్తుంది. బెల్లం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బెల్లం మిమ్మల్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎలా సహాయ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ముఖం మీద ముడతలు రావడం ప్రారంభం అవుతాయి. బెల్లంలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫలితంగా ముడతల సమస్య కూడా తగ్గుతుంది.
చర్మానికి బెల్లం ఎలా ఉపయోగించాలి ?
బెల్లం, తేనె ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
బెల్లం- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 1 టీ స్పూన్
అప్లై చేసే విధానం: పైన తెలిపిన మోతాదుల్లో 3 పదార్థాలను తీసుకుని ఒక బౌల్ లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీనిని 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.
బెల్లం, కలబంద మాస్క్:
కావాల్సినవి:
బెల్లం- 1 టేబుల్ స్పూన్
కలబంద- 1 టేబుల్ స్పూన్
అప్లై చేసే విధానం:పైన తెలిపిన మోతాదుల్లో 2 పదార్థాలను తీసుకుని ఒక బౌల్ లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీనిని 10-15 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వాడటం వల్ల ముఖం మెరిసిపోతుంది.
బెల్లం క్రమం తప్పకుండా తినడం వల్ల ముఖంపై మచ్చలు కూడా ఉండవు. బెల్లాన్నిప్యాక్ లాగా తయారు చేసుకుని కూడా మీ ముఖం మీద అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం 1 టీస్పూన్ టమాటో రసం, కాస్త నిమ్మ రసం, చిటికెడు పసుపు, కొంచెం వెచ్చని గ్రీన్ టీని 1 టీస్పూన్ బెల్లంలో కలపండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
చర్మానికి బెల్లం ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు:
కొల్లాజిన్ ఉత్పత్తి:
బెల్లంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడుతుంది. అంతే కాకుండా కొల్లాజిన్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది.
Also Read: సమ్మర్‌లో ముఖం నల్లగా మారుతోందా ? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే
ముడతలు:
బెల్లంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ముడతలు రాకుండా రక్షిస్తుంది.
వ్యర్థ పదార్థాల తొలగింపు:
బెల్లం శరీరంలో అంతర్గతంగా ఉండే వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. ఫలితంగా చర్మం సహజంగానే మెరుస్తుంది.
ఖనిజాలు పుష్కలం:
ఐరన్, మెగ్నీషియం, పొటాషియం బెల్లంలో అధిక మోతాదులో ఉంటాయి. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ వ్యవస్థకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫలితంగా చర్మం సహజంగా మెరుస్తుంది.