Big TV Live Originals: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. సమ్మర్ వచ్చిందంటే తరచుగా కొబ్బరి నీళ్లు తాగుతారు. బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఒకేసారి లీటర్ లేదా రెండు లీటర్ల కొబ్బరి నీళ్లను ఇంటికి తీసుకేళ్తారు. అయితే, కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసి తాగడం సురక్షితమా? కాదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఏంటి? ఈ నీళ్లను ఫ్రిజ్‌లో పెడితే ప్రమాదకరంగా మారతాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రిజ్‌లో కొబ్బరి నీళ్లు నిల్వ చేయడం సురక్షితమా?
కొబ్బరి నీళ్లు తాజాగా ఉన్నప్పుడు తాగడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగడం వీలు కాకపోతే ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చట. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో ఉంచిన 24 గంటలలోపు తాగడం మంచిది. ఎందుకంటే ఎక్కువ సమయం నిల్వ చేస్తే అవి పులిసిపోయే ఛాన్స్ ఉంటుది. లేదా కొబ్బరి నీళ్లలోని పోషక విలువలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నీళ్లను శుభ్రమైన గాజు లేదా స్టీల్ కంటైనర్‌లో నిల్వ చేయడం మంచిది. వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్‌ను వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్‌లో ఉండే కెమికల్స్ నీటిలో కలిసే అవకాశం ఉంటుంది.
ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి నీళ్లు తాగాలంటే?
ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి నీళ్లు చల్లగా ఉంటాయి. వీటిని ఎక్కువ కూల్‌గా ఉన్నప్పుడే తాగగితే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే, నీళ్లను రూం టెంపరేచర్‌కు వచ్చాక తాగడమే ఉత్తమం. మూత లేకుండానే కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడితే ఇతర ఆహార పదార్థాల వాసనలు వీటిని పట్టే అవకాశం ఉంటుంది. అందుకే కొబ్బరి నీళ్లలోకి మలినాలు చేరకుండా, గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచడం మంచిది.
వేసవిలో కొబ్బరి నీళ్ల వల్ల ప్రయోజనాలు
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడతాయట.
కొబ్బరి నీళ్లలో ఉండే నేచురల్ షుగర్స్, మినరల్స్ తక్షణ శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అలసటను తగ్గించేందుకు కూడా కొబ్బరి నీళ్లు సహాయపడతాయట.
ALSO READ: బొప్పాయి తింటున్నారా? ఇది తెలిస్తే షాక్ అవుతారు
తరచుగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నీళ్లు తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నీళ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇవి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయట.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.