E-Paper
Advertisement

Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్

Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్
Advertisement

Shiva Jyothi : తెలుగు టీవీ రంగంలో తీన్మార్ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించింది శివ జ్యోతి. వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ప్రోగ్రాం లో తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయింది. ఈ ప్రోగ్రాం లో బిత్తిరి సత్తితో కలిసి ఆమె చెప్పే వార్తలు తెలంగాణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తీన్మార్ శివ జ్యోతి అసలు పేరు సావిత్రి. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంది. ఈమె యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. ఆమె వ్యక్తిగత విషయాలతో పాటు, ప్రోగ్రామ్స్ కి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటుంది. తాజాగా వారి పెళ్లి రోజు సందర్భంగా తన భర్తని ఉద్దేశించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ పోస్టులో ఏముందో చూద్దాం..

నువ్వు లేకపోతే నేను..

Advertisement

శివ జ్యోతి తన భర్త గంగులీ తో కలిసి చేసే వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట ఏప్రిల్ 26న పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. తాజాగా శివ జ్యోతి తన ఇంస్టాగ్రామ్ లో తన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తో పాటు ఒక ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. ఈ పోస్టులో ఆమె ‘నువ్వు లేకపోతే నేనులేను ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో.. ఎటువంటి పూలతో పూజ చేశానో.. దేవుడు నాకోసం నిన్ను పుట్టించాడు. శివజ్యోతి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి.. ఇంతే నీ కోరిక.. నన్ను నా కన్నా ఎక్కువగా నువ్వు నమ్ముతావు.. థాంక్యూ ఫర్ ఎవరీ థింగ్’ అంటూ తన భర్త గంగోలిని ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. చివరిగా ఆమె అభిమానులు లేకపోతే మాకు ఇవేమీ ఉండవు అని ధన్యవాదాలు తెలిపింది. భర్తపై ఆమె చూపే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు వారిద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
.

ప్రేమ వివాహం ..

Advertisement

శివ జ్యోతి, గంగూలీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గంగూలీ సాఫ్ట్వేర్ ఉద్యోగి. శివజ్యోతి ది నిజామాబాద్ జిల్లా వీరిద్దరి పక్కపక్క గ్రామాలు కావడంతో ప్రేమలో పడ్డారు. వారిది పల్లెటూరు కావడంతో అక్కడ ఎవరు వీరి ప్రేమ ఒప్పుకోలేదు, చివరికి ఈమె పేరెంట్స్ కూడ ఒప్పుకోలేదు. ఇద్దరినీ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఊరి నుంచి బయటికి వచ్చేసారు. కట్టు బట్టలతో వచ్చిన శివ జ్యోతిని గంగోలి ప్రాణంగా చూసుకుంటున్నాడు. శివ జ్యోతకి పేరెంట్స్ వేరే వారితో పెళ్లి చేస్తామని ఒప్పించడానికి ఎంత ట్రై చేసినా గంగోలి మీద ప్రేమతో శివ జ్యోతి వారి మాట తిరస్కరించింది. గంగోలి ఎంతో ప్రేమగా శివజ్యోతిని చూసుకుంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యారు. ఈ జంట కలకాలం ఇలానే ఉండాలని వారి అభిమానులతో పాటు మనము కోరుకుందాం.

Deepika Rangaraju : ముద్దులిస్తే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు, ఆ తర్వాత బెడ్‌పై.. ‘బ్రహ్మముడి’ దీపిక బోల్డ్ కామెంట్స్

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×