Best fruits for eyesight: ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్ళు స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్ స్క్రీన్‌లకే అతుక్కుపోతున్నాయి. దీని వల్ల చిన్న వయసులోనే కంటి చూపు మసకబారడం, కళ్ళు పొడిబారడం, కళ్ళజోడు రావడం వంటి సమస్యలు కామన్ అయిపోయాయి. అయితే, కేవలం డ్రాప్స్ వేసుకోవడం, గ్లాసెస్ పెట్టుకోవడమే కాకుండా.. మనం తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పండ్లను చేర్చుకోవడం ద్వారా కంటి చూపును సహజంగానే సూపర్‌గా మెరుగుపరుచుకోవచ్చు. మన కళ్ళకు రీఛార్జ్ ఇచ్చే ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కంటి చూపును పెంచే సూపర్ ఫ్రూట్స్:
ఈ డిజిటల్ యుగంలో మన శరీరంలోనే అత్యంత బిజీగా ఉండే భాగం ఏదైనా ఉందంటే అది మన కళ్లే! నిరంతరం స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల కంటి అలసట ఎక్కువవుతోంది. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కెమికల్స్ ఉన్న మెడిసిన్స్ కంటే.. ప్రకృతి ఇచ్చిన పండ్లను నమ్ముకోవడం బెస్ట్ ఛాయిస్. మరి లేట్ చేయకుండా కంటి చూపును మెరుగుపరిచే ఆ టాప్ పండ్ల ముచ్చట్లేంటో చూసేద్దాం.
1. బొప్పాయి
మన కంటి చూపుకు అత్యంత అవసరమైన పోషకం విటమిన్ ‘ఎ’. బొప్పాయిలో ఈ విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి రెటినా దెబ్బతినకుండా కాపాడతాయి. రోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే రేచీకటి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
2. నారింజ, నిమ్మ
నారింజ, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ అద్భుతంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే శుక్లాలు,దృష్టి లోపాలను నివారించడంలో విటమిన్ సి ఒక షీల్డ్‌లా పనిచేస్తుంది.
3. కీవి పండు
మీరు సిస్టమ్స్ ముందు ఎక్కువ సేపు కూర్చునే వారైతే కీవి పండు మీ డైట్‌లో ఉండాల్సిందే. ఇందులో ‘లూటిన్’ ‘జియాక్సంతిన్’ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్లూ లైట్ (స్మార్ట్‌ఫోన్ల నుండి వచ్చే హానికరమైన కాంతి) వల్ల కళ్లకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
4. బ్లూబెర్రీస్ & నల్ల ద్రాక్ష
బెర్రీస్, నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్స్ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, కంటి భాగంలో రక్తప్రసరణను సాఫీగా సాగేలా చేస్తాయి. కంటి ఒత్తిడిని తగ్గించడంలో ఇవి బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తాయి.
5. మామిడి పండు
పండ్లలో రా జైన మామిడి పండు కేవలం రుచికే కాదు, కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో.. ఉండే విటమిన్ ఎ కంటి పొడిబారే సమస్యను దూరం చేస్తుంది.
కంటి చూపు బాగుండాలంటే కేవలం ఐ డ్రాప్స్ మాత్రమే సరిపోవు, లోపలి నుంచి పోషకాలు అందాలి. కాబట్టి, జంక్ ఫుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి, రోజూ మీ స్నాక్స్ టైమ్‌లో ఈ పండ్లను భాగం చేసుకోండి. మీ కళ్ళను హెల్తీగా మార్చుకోండి