E-Paper
Advertisement

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు వెనక్కి తీసుకోండి.. స్టాలిన్‌ను కోరిన కాంగ్రెస్ అగ్రనేతలు!

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు వెనక్కి తీసుకోండి.. స్టాలిన్‌ను కోరిన కాంగ్రెస్ అగ్రనేతలు!
Advertisement

Delimitation Bill: డీ లిమిటేషన్ బిల్లు అంశంపై రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక చెన్నైలోని మాజీ సీఎం అయిన స్టాలిన్ నివాసానికి INDIA కూటమి నేతలు చేరుకున్నారు. దీంతో స్టాలిన్‌తో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హజరుకానున్నారు.

స్టాలిన్‌‌తో చర్చ..

సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా మమతా బెనర్జీ సహా కూటమి కీలక నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. డీ లిమిటీషన్ బిల్లుకు డీఎంకే ప్రకటించిన మద్దతును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకులు స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించాలని స్టాలిన్‌ను కోరారు. డీలిమిటేషన్‌పై INDIA కూటమిలో విభేదాల నేపథ్యంలో కీలక భేటీకానుంది. దీంతో స్టాలిన్ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

వ్యతిరేకంగా నిరసనలు..

Advertisement

మాజీ సీఎం స్టాలిన్ భేటీ అనంతరం INDIA కూటమి నేతలు ముంబై వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో అక్కడ శరద్ పవార్‌తో సమావేశంకానున్నట్టు అధికారులు తెలిపారు. స్టాలిన్ ఇంటివద్ద ఇండి కూటమీ నేతలకు వ్యతిరేకంగా డీఎంకే యూత్ వింగ్ నిరసన తెలుపుతున్నారు. గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ నిరసన పోస్టర్లు చూపుతూ యూత్ వింగ్ నినాదాలు చేస్తున్నారు. మోసం, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు డిఎంకేతో చర్చించే అర్హత లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు.

Also Read: డీలిమిటేషన్‌తో 2016 జిల్లాల సరిహద్దు సమస్యలకు చెక్.. కానీ అసలు సమస్యలివే?

Tags

Related News

అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు.. అర్ధరాత్రి భయానక దృశ్యాలు! రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం

చెన్నైకి కాంగ్రెస్ అగ్రనేతలు.. రాజకీయ పార్టీల అధినేతలతో మంతనాలు, చివరికి జగన్‌తో కూడా!

నుజ్జయిన స్కార్పియో వాహనం.. స్పాట్‌లో 13 మంది మృతి, రాంచీ-పాట్నా హైవేపై ఘోర ప్రమాదం

తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!

మన అన్నమయ్య పాటకు విదేశాల్లో అరుదైన గౌరవం.. అదిరిపోయిందిగా!

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీ శక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ!

గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం.. డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్ వెనుక అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×