Chicken soup recipe: బయట వాతావరణం చల్లగా ఉన్నా, వర్షం పడుతున్నా లేదా ఒంట్లో కొంచెం నీరసంగా, జలుబుగా అనిపిస్తున్నా వేడి వేడిగా ఒక బౌల్ చికెన్ సూప్ తాగితే ఆ ఫీలింగే వేరు కదా? లైట్‌గా, హెల్తీగా ఉంటూనే నోటికి .. కమ్మగా, కారంగా తగిలే ఈ సూప్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. బయట హోటళ్లలో.. దొరికే సూప్ కంటే ఎంతో శుభ్రంగా, పోషకాలతో నిండిన చికెన్ సూప్‌ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బోన్‌లెస్ చికెన్ – 150 గ్రాములు
ఉల్లిపాయ – 1 చిన్నది
వెల్లుల్లి రెబ్బలు – 5 నుంచి 6
అల్లం తురుము – 1 టీ స్పూన్
క్యారెట్, బీన్స్ ముక్కలు – పావు కప్పు
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి – 1 టీ స్పూన్
నెయ్యి లేదా బటర్ – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 3 నుంచి 4 కప్పులు
కొత్తిమీర, ఉప్పు – రుచికి సరిపడా
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా.. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎముకలతో కూడిన చిన్న ముక్కలు కూడా వేస్తే.. సూప్‌కు ఇంకా మంచి ఫ్లేవర్, రిచ్‌నెస్ వస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, బీన్స్‌ను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
2. స్టవ్ మీద పాన్ లేదా గిన్నె పెట్టి నెయ్యి లేదా బటర్ వేయాలి. బటర్ కరిగాక తరిగిన వెల్లుల్లి, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు 30 సెకన్లు వేయించాలి.తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గులాబీ రంగు వచ్చేవరకు వేగించాలి.
3. ఇప్పుడు చికెన్ ముక్కలు, క్యారెట్, బీన్స్ ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి రెండు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత 3 నుంచి 4 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్ మెత్తగా ఉడికి, ఆ సారం అంతా నీళ్లలోకి దిగే వరకు మీడియం ఫ్లేమ్‌లో 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాలి.
4. చికెన్ ఉడికాక ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి, కొద్దిగా చల్లటి నీళ్లతో ఉండలు లేకుండా కలపాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరుగుతున్న సూప్‌లో పోస్తూ వెంటనే గరిటెతో కలపాలి. ఇలా చేస్తే సూప్ రెస్టారెంట్ స్టైల్‌లో కొంచెం చిక్కగా, క్రీమీగా వస్తుంది. చివరగా మిరియాల పొడి వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి.సూప్ కన్సిస్టెన్సీ సరిగ్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. కావాలంటే తాగే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది.
ఎక్కువ మసాలాలు లేకుండా, సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో నిమిషాల్లో తయారయ్యే ఈ చికెన్ సూప్‌ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి!