E-Paper
Advertisement

జలుబు,ఫీవర్ టైమ్‌లో నోటికి రుచిగా..ఘాటైన రొయ్య పొట్టు చారు ఇలా ట్రై చేయండి!

జలుబు,ఫీవర్ టైమ్‌లో నోటికి రుచిగా..ఘాటైన రొయ్య పొట్టు చారు ఇలా ట్రై చేయండి!
Advertisement

Royya Pottu Charu:  పెద్ద రొయ్యలతో ఫ్రై లేదా బిర్యానీ చేస్తాం కానీ, చిన్న రొయ్యలతో చేసే.. చారుకు ఉండే మజానే వేరు. చిన్న రొయ్యల్లో.. ఉండే సహజమైన రుచి, కమ్మదనం చారుకు అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇస్తాయి. ముఖ్యంగా.. వర్షాకాలంలో లేదా చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, లేదంటే నోరు కాస్త చేదుగా, జలుబుగా ఉన్నప్పుడు ఈ వేడివేడి చారు తింటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. రొయ్యలు తినేవారికి.. ఇది కంఫర్ట్ ఫుడ్ లాంటిది.ఇంట్లో పెద్దగా కూరలు లేనప్పుడు కూడా ఈ చిన్న రొయ్యల చారుతో భోజనం సూపర్‌గా సాగిపోతుంది.

కావలసిన పదార్థాలు:

చిన్న రొయ్యలు (రొయ్య పొట్టు): 1 కప్పు

Advertisement

చింతపండు: నిమ్మకాయంత సైజు

ఉల్లిపాయ: 1

Advertisement

టమాటో: 1

పచ్చిమిర్చి: 3 లేదా 4

వెల్లుల్లి రెబ్బలు: 5 నుంచి 6

కరివేపాకు: 2 రెమ్మలు

కొత్తిమీర తరుగు: కొద్దిగా

నూనె: 2 నుండి 3 టేబుల్ స్పూన్లు

మసాలాలు, పోపు దినుసులు:

ఆవాలు: అర టీస్పూన్

జీలకర్ర: 1 టీస్పూన్

మెంతులు: పావు టీస్పూన్

పసుపు: పావు టీస్పూన్

కారం: 2 టీస్పూన్లు

ధనియాల పొడి: 1 టీస్పూన్

మిరియాల పొడి: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా చిన్న రొయ్యలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తల భాగాలు, పొట్టు లాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఏరి నీళ్లు లేకుండా వడకట్టాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక చిన్న రొయ్యలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో 4 నుండి 5 నిమిషాలు వేయించాలి. రొయ్యల్లోని నీరు ఇంకి, పచ్చి వాసన పోయి, మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు చారు చేసుకునే గిన్నె లేదా మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చారుకు సూపర్ టేస్ట్ ఇస్తుంది.

3. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలాలు మాడిపోకుండా నిదానంగా కలపాలి.

4.టమాటోలు బాగా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న చింత పండు రసం పోయాలి. ఇందులోనే .. ముందుగా వేయించి పెట్టుకున్న చిన్న రొయ్యలు, చారుకు సరిపడా నీళ్లు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కలపాలి. చారు మరీ గట్టిగా కాకుండా, మరీ నీళ్లలా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి.

Also Read: పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

5. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చారును 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా మరిగించాలి. రొయ్యల ఫ్లేవర్, చింతపండు పులుపు, కారం చక్కగా కలిసిపోయి చారు రంగు మారుతుంది. చివరగా.. కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

చారు మరిగేటప్పుడు చిటికెడు బెల్లం వేస్తే పులుపు, కారం, ఘాటు బ్యాలెన్స్ అయ్యి రుచి డబుల్ అవుతుంది. ఈ చిన్న రొయ్యల చారును వేడి వేడి అన్నంతో పాటు పప్పు లేదా ఆమ్లెట్ లేదా చేపల వేపుడుతో తింటే కాంబినేషన్ అదిరిపోతుంది. చిన్న రొయ్యలు దొరికినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి!

Related News

రోటీ,బిర్యానీలోకి అదిరిపోయే కాంబినేషన్..రాయల్ మొగలాయ్ ఎగ్ కర్రీ సీక్రెట్ రెసిపీ!

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!

సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

నెల రోజుల పాటు నిల్వ ఉండే..గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి!

Big Stories

Advertisement
×