E-Paper
Advertisement

గుత్తి బెండకాయ వేపుడు..జిగురు లేకుండా క్రిస్పీగా ఇలా చేయండి!

గుత్తి బెండకాయ వేపుడు..జిగురు లేకుండా క్రిస్పీగా ఇలా చేయండి!
Advertisement

Guthi bendakaya vepudu: వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పప్పుచారు లేదా సాంబార్ వేసుకుని, పక్కన కరకరలాడే వేపుడు ఉంటే.. ఆ మజానే వేరు కదా? అందులోనూ మసాలాలు దట్టించిన గుత్తి బెండకాయ వేపుడు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి! చాలా మందికి బెండకాయ వేపుడు అంటే జిగురు వస్తుందనే భయం ఉంటుంది. కానీ.. సరైన పద్ధతిలో చేస్తే జిగురు లేకుండా పర్ఫెక్ట్ క్రిస్పీగా వస్తుంది. రెస్టారెంట్, పెళ్లి భోజనం స్టైల్‌లో ఘుమఘుమలాడే గుత్తి బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

లేత బెండకాయలు – పావు కిలో

Advertisement

పల్లీలు – 3 టేబుల్ స్పూన్లు

నువ్వులు – 1 టేబుల్ స్పూన్

Advertisement

ఎండుకొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 7

జీలకర్ర – అర స్పూన్

కారం – 1.5 స్పూన్లు

పసుపు – పావు స్పూన్

ధనియాల పొడి – 1 స్పూన్

కరివేపాకు – రెండు రెబ్బలు

నూనె – వేయించడానికి సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా లేతగా, తాజాగా ఉన్న బెండకాయలను శుభ్రంగా కడిగి, ఒక కాటన్ క్లాత్‌తో తడి అస్సలు లేకుండా బాగా తుడవాలి. తడి ఉంటే వేపుడు చేసేటప్పుడు జిగురు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బెండకాయ చివరలు కొద్దిగా కట్ చేసి, మధ్యలోకి నిలువుగా పూర్తిగా విడిపోకుండా గాటు పెట్టుకోవాలి.

2. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పల్లీలు, నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారనివ్వాలి. అవి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి, ఎండుకొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొద్దిగా వేయించిన శనగపప్పు (పుట్నాలు) కూడా వేసుకోవచ్చు, దీనివల్ల మసాలాకు మంచి బైండింగ్ వస్తుంది.

3. ఇప్పుడు సిద్ధం చేసుకున్న మసాలా పొడిని గాటు పెట్టిన ప్రతి బెండకాయ లోపలికి గట్టిగా కూరాలి. మసాలా బయటకు రాలేకుండా.. కొద్దిగా నొక్కి పెడితే సరి పోతుంది. ఇలా అన్ని బెండకాయలను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత వెడల్పాటి పాన్ లేదా బాణలిలో నూనె వేడి చేసి, మసాలా కూరిన బెండకాయలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. మంటను ఎప్పుడూ లో లేదా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. అప్పుడే బెండకాయ లోపలి వరకు చక్కగా వేగి, మసాలా మాడిపోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో మెల్లగా తిప్పుతూ, కరివేపాకు కూడా వేసి బెండకాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

బెండకాయలు చక్కగా వేగి క్రిస్పీగా మారాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. దీనిని వేడివేడి అన్నంలో పప్పు, పప్పుచారు లేదా సాంబార్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. పప్పు అన్నంలో నంచుకోవడానికి ఇది బెస్ట్ సైడ్ డిష్.

చిట్కాలు:

బెండకాయలు కడిగిన తర్వాత ఫ్యాన్ గాలిలో లేదా క్లాత్‌తో పూర్తిగా ఆరబెట్టాలి. అలాగే వేయించేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరికి జిగురు ఏర్పడుతుంది.

లేత కాయలే: ముదిరిన బెండకాయలతో చేస్తే గింజలు గట్టిగా ఉండి రుచి అంతగా బాగోదు. కాబట్టి ఎప్పుడూ లేత బెండకాయలనే ఎంచుకోవాలి.

సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో, తక్కువ టైమ్‌లో రెస్టారెంట్ రేంజ్ రుచిని ఇచ్చే ఈ గుత్తి బెండకాయ వేపుడును ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేయండి!

Tags

Related News

రెస్టారెంట్ స్టైల్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్..నిమిషాల్లో రెడీ!

జలుబు,ఫీవర్ టైమ్‌లో నోటికి రుచిగా..ఘాటైన రొయ్య పొట్టు చారు ఇలా ట్రై చేయండి!

రోటీ,బిర్యానీలోకి అదిరిపోయే కాంబినేషన్..రాయల్ మొగలాయ్ ఎగ్ కర్రీ సీక్రెట్ రెసిపీ!

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!

సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

Big Stories

Advertisement
×