Aluminium Foil Hacks: సాధారణంగా మన ఇంట్లో అల్యూమినియం ఫాయిల్‌ను కేవలం ఆహారాన్ని ప్యాక్ చేయడానికే వాడుతుంటాం. కానీ, దానికి చిన్న చిన్న రంధ్రాలు పెడితే ఊహించని విధంగా ఎన్నో పనులకు అది తాత్కాలిక పరిష్కారంగా పనిచేస్తుంది. వినడానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా.. అత్యవసర సమయాల్లో చేతిలో సరైన వస్తువు లేనప్పుడు ఈ చిట్కా భలే ఆదుకుంటుంది. వంట చేసేటప్పుడు ఆవిరిని బయటకు పంపడం నుంచి పిల్లల చిన్నపాటి క్రాఫ్ట్ వర్క్స్ వరకు దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. అయితే, ఇది అన్ని పనులకూ శాశ్వత ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా వేడి, ఆహారం, కిచెన్ పరికరాల దగ్గర దీన్ని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
మనం ఏదైనా వంటకం బేక్ చేసేటప్పుడు లేదా వేడి చేసేటప్పుడు గిన్నెపై ఫాయిల్ కప్పుతాం. దానికి చిన్న రంధ్రాలు పెడితే లోపలి ఆవిరి బయటకు పోతుంది. దీనివల్ల ఫాయిల్ కింద నీటి ఆవిరి పేరుకుపోయి ఆహారం మెత్తబడకుండా తాజాగా ఉంటుంది.
ఒక్కోసారి ఇంట్లో టీ వడకట్టే జల్లెడ లేదా స్ట్రైనర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒక గిన్నెపై అల్యూమినియం ఫాయిల్‌ను గట్టిగా కప్పి, టూత్‌పిక్‌తో కొన్ని రంధ్రాలు చేయండి. ద్రవ పదార్థాలను వడకట్టడానికి ఇది తక్షణ పరిష్కారంగా పనిచేస్తుంది.
Also Read: రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే కొబ్బరి నీళ్లలో వీటిని కలిపి తాగండి!
వేడిగా ఉన్న ఆహార పదార్థాలపై పూర్తిగా మూత పెడితే ఆవిరి పడుతుంది. అలాగని తెరిచి ఉంచితే దుమ్ము పడుతుంది. ఇలాంటప్పుడు ఫాయిల్‌కు చిన్న రంధ్రాలు చేసి గిన్నెపై కప్పితే గాలి ఆడుతూ ఆహారం సురక్షితంగా చల్లారుతుంది.
ఇంట్లో పిల్లలు చేసే చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రాజెక్టులకు ఇది భలే పనికొస్తుంది. ఫాయిల్‌పై ఒకే వరుసలో రంధ్రాలు పెడుతూ అందమైన డిజైన్లు వేయొచ్చు. అయితే రంధ్రాలు చేసేటప్పుడు అంచులు పదునుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వంటగదిలో కాకుండా ఇతర చిన్నపాటి ఇంటి పనుల్లో పొడి పదార్థాలను జల్లించడానికి దీన్ని వాడొచ్చు. అయితే ఫాయిల్ త్వరగా చిరిగిపోతుంది కాబట్టి.. ఇది కేవలం తాత్కాలిక అవసరాలకు మాత్రమే వాడాలి. అలాగే ఈ చిట్కాలను పాటించేటప్పుడు అల్యూమినియం ఫాయిల్‌ను పొరపాటున కూడా మైక్రోవేవ్ ఓవెన్‌లో వాడకూడదని గుర్తుంచుకోండి.
Also Read: సోషల్ మీడియా పోస్టులు చూసి ‘నా లైఫ్ ఎందుకిలా ఉంది?’ అని బాధపడుతున్నారా? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!