Meal maker fried rice: రోజు వారీగా వండే.. రైస్ ఐటమ్స్ తిని బోర్ కొడుతుందా? పిల్లలు, ఇంట్లోని పెద్దలు ఏదైనా డిఫరెంట్‌గా, టేస్టీగా అడుగుతున్నారా? అయితే.. మీకోసమే ఈ అద్భుతమైన మిల్ మేకర్ (సోయా చంక్స్) ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ స్టైల్ రుచితో, ఎక్కువ ప్రోటీన్ పోషకాలతో.. నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ లంచ్ బాక్స్‌లకు లేదా ఈవినింగ్ డిన్నర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. బయటి చైనీస్ ఫుడ్ కంటే ఎంతో శుభ్రంగా, ఈజీగా ఇంట్లోనే జ్యూసీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం – 2 కప్పులు
మిల్ మేకర్ (సోయా చంక్స్) – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1
పచ్చిమిర్చి – 3
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు
సోయా సాస్ – 1 స్పూన్
రెడ్ చిల్లీ సాస్ – 1 స్పూన్
వెనిగర్ – 1 స్పూన్
గరం మసాలా లేదా ఫ్రైడ్ రైస్ మసాలా – 1/2 స్పూన్
మిరియాల పొడి – 1/2 స్పూన్
ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, ఉప్పు – రుచికి సరిపడా
1. ముందుగా ఒక పాత్రలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు వేసి మిల్ మేకర్‌ను 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని చల్లటి నీళ్లలో వేసి, నీళ్లన్నీ పూర్తిగా పోయేలా బాగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిల్ మేకర్‌లో కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.
2.పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి, మసాలా పట్టించిన మిల్ మేకర్‌ను దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ పచ్చి వాసన పోయి, ఫ్రైడ్ రైస్‌లో తింటుంటే భలే జ్యూసీగా, క్రిస్పీగా ఉంటుంది.
3. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌పై 2 నిమిషాలు ఫ్రై చేయాలి. చైనీస్ వంటకాలకు కూరగాయలు సగం మాత్రమే ఉడకాలి, అప్పుడే ఆ క్రిస్పీనెస్ లభిస్తుంది. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగించాలి.
4. కూరగాయలు వేగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ వేయాలి. ఇప్పుడు సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా ఉడికించిన పొడిపొడి అన్నాన్ని ఇందులో వేసి మసాలాలు, సాస్లు అన్నానికి బాగా పట్టేలా బాగా టాస్ చేయాలి. 2 నిమిషాలు హై ఫ్లేమ్‌పై బాగా కలపాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తి మీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. దీనిని రైతాతో గానీ లేదా మంచూరియా గ్రేవీతో గానీ తింటే అద్భుతంగా ఉంటుంది.
తక్కువ సమయంలో, ఇంట్లోని పదార్థాలతోనే హోటల్ స్థాయి రుచిని అందించే ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.