BigTV English

Tenant Videos Recorded with hidden cameras : బాత్‌రూమ్, బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు.. యువతి వీడియోలు రికార్డ్ చేసిన ఇంటి ఓనర్!

Tenant Videos Recorded with hidden cameras : బాత్‌రూమ్, బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు.. యువతి వీడియోలు రికార్డ్ చేసిన ఇంటి ఓనర్!

Landlord Records Tenant Videos with Hidden Cameras | దేశంలో మహిళలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకీ పెరిగపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఘటన జరిగింది. అద్దె ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చి ఒంటిరిగా నివసిస్తున్న యువతి నగ్న వీడియాలను ఆ ఇంటి ఓనర్ రికార్డ్ చేశాడు. ఆమె బాత్ రూమ్ లో ఉన్నప్పుడు, బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో అక్కడ స్పై కెమెరాలు అమర్చి ఈ వీడియోలను రికార్డ్ చేశాడు. ఈ విషయం అనుకోకుండా ఆ యువతికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడు.. ఒక దివ్యాంగుడు కావడం విశేషం.


పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని శాకర్ పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో కనిష్క (పేరు మార్చబడినది) అనే యువతి ఒంటరిగా నివసిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన కనిష్క.. సివిల్ సర్వీస్ పరీక్షల శిక్షన కోసం ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది. అయితే ఆ ఇంటి ఓనర్ కు 30 ఏళ్ల కుమారుడున్నాడు. అతని పేరు కరణ్. కనిష్కతో కరణ్ స్నేహంగా ఉండేవాడు. కరణ్ ఒక దివ్యాంగుడు కావడంతో కనిష్క కూడా అతడిని పూర్తిగా నమ్మింది.

Also Read: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..


గత సంవత్సరకాలంగా కనిష్క ఆ ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. ఆమె తరుచూ తన తల్లిదండ్రులను కలవడానికి రాజస్థాన్ వెళ్లేది. ఆ సమయంలో ఇంటి తాళం చెవులు కరణ్ తనకు ఇవ్వాలని కోరడంతో కనిష్క అభ్యంతరం చెప్పకుండా ఇచ్చేసేది. కానీ ఇటీవల ఒకరోజు కనిష్క వాట్సాప్ అకౌంట్ మరెవరో ఉపయోగిస్తున్నట్లు ఆమెకు కనిపించింది. ఇతరుల లాప్ టాప్ కు తన వాట్సాప్ లింక్ అయిందని ఆమెకు తెలియడంతో కనిష్కకు అనుమానం కలిగింది. దీంతో ఆమె వెంటనే ఆ లింక్ ని తొలగించింది. ఇంకా తన ఇంట్లో ఏదో తప్పు జరుగుతోందా? అని ఆమెకు అనిపించింది.

ఉదయం బాత్ రూమ్ లో స్నానానికి వెళ్లగా.. అక్కడ అనుకోకుండా కనిష్క ఒక విషయం గమనించింది. బాత్ రూమ్ బల్బు హోల్డర్ లో ఏదో కెమెరాలాంటి ఆకారం గమనించింది. వెంటనే ఆ బల్బుని తీసి ఆ హొల్డర్ ని విప్పి చూస్తే.. అందులో ఏదో చిప్, ఒక మెమోరీ కార్డ్ లభించింది. ఇదంతా చూసి కనిష్క షాక్ కు గురైంది. పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటినంతా సోదా చేసి.. ఆమె బెడ్ రూమ్ లో కూడా ఇలాగే బల్బు హోల్డర్ లో రహస్య కెమెరా అమర్చినట్లు గుర్తించారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

కనిష్క ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయగా.. ఆమె రాజస్థాన్ వెళ్లిన సమయంల ఇంటి తాళాలు కరణ్ కు ఇచ్చానని.. అతనికి ఏదో అవసరం ఉండడంతో తననకు సహాయం చేయమని అడగడంతో ఇచ్చానని తెలిపింది. దీంతో పోలీసులు కరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కరణ్ దివ్యాంగుడు కావడంతో అతడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రశ్నించగా.. కరణ్ అప్పుడు నిజం చెప్పాడు. తాను దివ్యాంగుడు కావడంతో పెళ్లి సంబంధాలు రావడం లేదని అందుకే కనిష్క అందాలను చూడడానికి ఆ పని చేశానని అంగీకరించాడు.

స్పై కెమెరాలతో మహిళను నగ్నంగా వీడియోలు రికార్డ్ చేసినందుకు కరణ్‌ను అరెస్టు చేసి.. పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం.. కరణ్ కు ఒక సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

 

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×