Nara Lokesh: ఆ అప్పులు తీర్చలేక మేము పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వృథాగా నిధులన్నీ ఖర్చుపెట్టారు. గత ప్రభుత్వ పాపాలు మాకు తగిలాయి. అయితేనేమి వెనక్కు తగ్గం. రాష్ట్ర అభివృద్దితో పాటు, సంక్షేమ పథకాల అమలును తప్పక సాగిస్తాం. ప్రజలారా.. కూటమి చేస్తున్న అభివృద్దిని సంక్షేమాన్ని గమనించండి అంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వైసీపీ విమర్శలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఎక్కడ సూపర్ సిక్స్ అంటూ రోజుకొక వైసీపీ నేత మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మాజీ సీఎం జగన్ కూడ ఇటీవల సూపర్ సిక్స్ లేదు.. ఏమి లేదు.. అంతా బూటకమేనంటూ కీలక కామెంట్స్ చేశారు. దీనితో కూటమి నేతలు కూడ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. కూటమి హయాంలో జరుగుతున్న అభివృద్దిని చూసి, ఓర్వలేకనే జగన్ ఏవేవో విమర్శలు చేస్తున్నట్లు ప్రతివిమర్శలు సాగిస్తున్నారు.
తాజాగా నారా లోకేష్ కూడ స్పందించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులు సూపర్ సిక్స్ గురించి అడగగా, లోకేష్ ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లు పాలన సాగిందో మీకు తెల్సిందే. వైపీసీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యమవుతున్నాయన్నారు. మాజీ సీఎం జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగిపోయేలా చేశారని, ఆ ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి నెల రూ. 4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తోందన్నారు. 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని, మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ అన్నారు.
Also Read: AP High Court Jobs: గుడ్ న్యూస్.. ఎలాంటి ఫీజు, రాతపరీక్ష లేకుండా జాబ్స్.. మిస్ అవ్వొద్దు..!
లోకేష్ మాటలను బట్టి త్వరలోనే మరో రెండు పథకాలు ప్రజల ముందుకు రానున్నాయని అర్థం చేసుకోవచ్చు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్, రైతులకు పెట్టుబడి సాయం త్వరలోనే అమలు కానున్నాయని లోకేష్ చెప్పకనే చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తూ, అభివృద్దితో పాటు సంక్షేమం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందుకు ప్రజలు కూడ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని లోకేష్ కోరారు.
గత వైపీసీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం: మంత్రి నారా లోకేష్
గత ప్రభుత్వ బకాయిలను మేం చెల్లిస్తున్నాం
ప్రతి నెల రూ. 4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో నడుస్తోంది
6 గ్యారంటీల్లో రెండు అమలు చేశాం
మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చాం
6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు… pic.twitter.com/8d39XKwVQS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025