BigTV English

Caner Drug : మొండి కేన్సర్‌కు దివ్యౌషధం..

Caner Drug : మొండి కేన్సర్‌కు దివ్యౌషధం..

Mesothelioma Cancer : ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే కేన్సర్ మెసొథిలియోమా. ఈ మొండి కేన్సర్‌కు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ దివ్యమైన ఔషధాన్ని కనిపెట్టారు. ఈ కేన్సర్ వస్తే మూడేళ్లకు మించి బతికే చాన్స్ లేదు.


కానీ లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ రిసెర్చర్లు కేన్సర్ రోగుల సర్వైవల్ రేటును పెంచగలిగే చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో కణితికి ఆహారం అందకుండా చేయగలిగారు. మెసొథిలియోమా కేన్సర్ చికిత్సలో ఇలా చేయడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి. మెసొథిలియోమా అనేది ఊపిరితిత్తుల్లో వృద్ధి చెందే కేన్సర్. ఆస్బెస్టాస్‌ పని ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా దీని బారిన పడతారు. బ్రిటన్‌లో ఏటా 2700 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని అంచనా.

Read more : కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి..?


క్వీన్ మేరీ వర్సిటీ పరిశోధకులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాల్లో ట్రయల్స్ నిర్వహించారు. రోగులందరికీ ప్రతి 3 వారాలకు ఆరు రౌండ్ల కీమోథెరపీ అందేలా చేశారు. సగం మందికి కొత్త ఔషధం ADI-PEG20 ఇచ్చారు. మిగిలిన వారికి రెండేళ్ల పాటు ప్లూసిబో ఇచ్చారు.

ప్లూసిబో, కీమోథెరపీ తీసుకున్న రోగులతో పోలిస్తే కొత్త ఔషధం ఇంజెక్ట్ చేసిన రోగులు సగటున 1.6 నెలలు ఎక్కువగా జీవించారు. మొత్తం మీద కొత్త ఔషధం తీసుకున్న వారి జీవన కాలం 36 నెలలు పెరిగిందని పరిశోధకులు వివరంచారు.

రక్తంలో ఆర్జినైన్ స్థాయులను గణనీయంగా తగ్గిస్తుంది. ఆర్జినైన్ అనేది శరీరంలో ప్రొటీన్ తయారీకి ఉపయోగపడే ఒకరమైన అమినో యాసిడ్.

కేన్సర్ కణుతులు ఆర్జినైన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోలేవు. ఆర్జినైన్ స్థాయులను తగ్గించడం ద్వారా పరిశోధకులు కణితి వృద్ధిని విజయవంతంగా అడ్డుకోగలిగారు.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×