BigTV English

Escalators: ఎస్కలేటర్ ఇరువైపులా సేఫ్టీ బ్రష్ లు, ఎందుకో తెలుసా?

Escalators: ఎస్కలేటర్ ఇరువైపులా సేఫ్టీ బ్రష్ లు, ఎందుకో తెలుసా?

మనం తరచుగా షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, స్టార్ హోటళ్లకు వెళ్తూ ఉంటాం. అక్కడ సాధారణంగా ఎస్కలేటర్లు కనిపిస్తాయి. మెట్లు, లిఫ్టులు ఉన్నప్పటికీ, కొంత మంది ఎస్కలేటర్ ద్వారానే పై ఫ్లోర్లకు వెళ్తుంటారు. అయితే, ఈ ఎలస్కలేటర్లకు ఇరు వైపులా బ్రష్ లు కనిపిస్తాయి. చాలా మంది వాటితో షూను క్లీన్ చేసుకుంటారు. కానీ, వాటిని ఎందుకోసం ఏర్పాటు చేశారో చాలా మందికి తెలియదు. ఇంతకీ వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


‘సేఫ్టీ బ్రష్ ల’ ఉపయోగాలు ఇవే!

ఎస్కలేటర్లకు ఏర్పాటు చేసే బ్రష్ లను ‘సేఫ్టీ బ్రష్ లు’ అని పిలుస్తారు. చాలా మంది వీటిని ఎస్కలేటర్లను శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేశారు అనుకుంటారు. కానీ, వాటిని ఏర్పాటు వెనుక ఉద్దేశం వేరే ఉంది. వీటిని సేఫ్టీ కోసం ఏర్పాటు చేస్తారు. ఎస్కలేటర్ లో ఉండే పసుపు రంగుకు చివరలో ఈ బ్రష్  లు ఉంటాయి. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, సాధారణంగా ప్రయాణీకులు పసుపు రంగు లైన్ కు దూరంగా ఉంచడం మంచిది. ఈ బ్రష్ లు సాధారణంగా దుస్తులు, షూ లేసులు, ఇతర సన్నని వస్తువులు ఎస్కలేటర్ లో చిక్కుకోకుండా కాపాడుతాయి. సాధారణంగా ప్రయాణీకులు తమ దుస్తులకు, లేదంటే షూకు బ్రష్ రుద్దినట్లు అనిపించినప్పుడు సాధారణంగానే దూరంగా వెళ్లిపోతారు. అలా దూరంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బ్రష్ లను ఇన్ స్టాల్ చేస్తారు.


సేఫ్టీ బ్రష్ తో షూ శుభ్రం!

మరికొంత మంది ఈ బ్రష్ ను ఉపయోగించి తమ షూ శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా చేయడం చాలా ప్రమాదం అంటారు నిపుణులు. ఎస్కలేటర్ ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉందంటున్నారు. వీలైనంత వరకు ఎస్కలేటర్ ఎక్కినప్పుడు రెండు ఎల్లో కలర్ లైన్లకు మధ్యలో ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అందుకే, ఎస్కలేటర్ మీద ప్రయాణం చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

Read Also: ఆకాశం నుంచి వింత శబ్దాలు.. భయంతో పరుగులు తీసిన జనాలు!

తరచుగా ఎస్కలేటర్ ప్రమాదాలు

ఎస్కలేటర్ ప్రమాదాలకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఎస్కలేటర్లు ఎక్కిన వారు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల దుస్తులు, షూ లేసులు, సన్నని వస్తువులు అందులో చిక్కుకుని గాయపడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. అందుకే, మీరు కూడా ఎస్కలేటర్ ఎక్కినప్పుడు బ్రష్ లను కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. “ఇటీవల నా భర్త ఓ మహిళకు సాయం చేశాడు. ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఆమె చున్నీ ఎస్కలేటర్ లో ఇరుక్కుపోయింది. వెంటనే తను స్పందించి ఎస్కలేటర్ ను ఆఫ్ చేసి, ఆమె చున్నీని బయటకు తీశాడు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చింది. “నా ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ ఎస్కలేటర్‌ లో చిక్కుకుంది. దానికి ఆయిల్/గ్రీజు మరకలు అంటాయి. వాటిని తొలగించడం కష్టం అయ్యింది. అప్పటి నుంచి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాను” అని మరో నెటిజన్ వివరించింది.

Read Also:  ఈ పిల్లాడివి ‘ఊసరవెల్లి’ కళ్లు.. రంగులు ఎలా మారుతున్నాయో చూడండి!

Tags

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×