చిన్న పిల్లలను చూస్తుంటే మనం కూడా పిల్లల్లా మారిపోతాం. కల్మషం ఎరుగని నవ్వులు చూస్తే లోకాన్ని మైమరచిపోతాం. వారితో ఆడుకుంటూ అన్ని బాధలను మార్చిపోతాం. చిన్న పిల్లలు మనల్ని కూడా వారి లోకంలోకి తీసుకెళ్తారు. వారిలాగే మనల్ని మార్చివేస్తారు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే బాలుడు మరింత స్పెషల్. తన అరుదైన కళ్లతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తున్నాడు. ఇంతకీ వాడి ప్రత్యేకత ఏంటో తెలుసా?
అర్ష్.. కళ్లు వెరీ స్పెషల్!
ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ కు చెందిన 1.5 ఏండ్ల బాలుడు అర్ష్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హల్ చల్ అవుతున్నాడు. అంత చిన్న బాలుడు ఎందుకు హైలెట్ అవుతున్నాడు? అనే డౌట్ వస్తుందా? అసలు విషయం ఏంటంటే.. ఈ బాలుడి కళ్లు. అతడి గ్లాసీ ఐస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కళ్లు ఆశ్చర్యం కలిగించడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. అతడి కళ్లు చాలా చాలా స్పెషల్ గా ఉన్నాడు. అతడు ఏ కలర్ డ్రెస్ ధరిస్తే కళ్తు ఆ రంగులోకి మారిపోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజం.
కళ్లతో మంత్ర ముగ్దులను చేస్తున్న చిన్నోడు
అర్ష్.. వైరల్ కావడానికి కారణం అతడి కళ్లు. గాజు లాంటి కళ్లు అందరినీ కట్టిపడేస్తున్నాడు. అతడు వేసుకునే దుస్తులను రంగును బట్టి కళ్ల రంగు మారిపోతోంది. డార్క్ బ్లూ కలర్ నుంచి మొదలుకొని ఎరుపు రంగు వరకు, గ్రే కలర్ నుంచి బ్లాక్ కలర్ వరకు ఏ రంగు బట్టలైనా వేసుకోనీ, అదే రంగులోకి కళ్లు మారుతున్నాయి. రీ సెంట్ గా ఆ చిన్నోడి కళ్లను చుట్టు పక్కల వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది గంటల్లోనే అతడి వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాతో పాటు స్థానిక మీడియా కూడా అర్ష్ కళ్ల గురించి స్పెషల్ స్టోరీస్ వేశాయి.
Read Also: బట్టతల ఉందని బాధపడుతున్నారా? అయితే, మీకు షఫీక్ గురించి తెలియాల్సిందే!
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
అతడి కళ్లు ఎందుకు రంగు మారుతున్నాయంటే?
ఇక అర్ష్ గురించి వార్తలు మీడియాలో ప్రసారం కావడంతో పలువురు కంటి డాక్టర్లు అతడి గురించి ఆరా తీశారు. అర్ష్.. కళ్లు ఎలా రంగు మారుతున్నాయి? అనే అంశంపై చర్చించారు. అతడి కళ్లు ఇతరుల కళ్ల మాదిరిగా కాకుండా కనుగుడ్లు మరింత పారదర్శకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే అతడు వేసుకున్న దుస్తుల రంగు కళ్లలో ప్రతిబింబిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఎలాంటి మాయ మర్మం లేదంటున్నారు. మొత్తంగా అర్ష్.. ఇప్పుడు బులందర్ షహర్ తో పాటు యూపీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందరి హృదయాలను దోచుకుంటున్నాడు. మరోవైపు అర్ష్ ను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తరలి వస్తున్నారు. నిజంగా అతడి కళ్లు అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: ఆకాశం నుంచి వింత శబ్దాలు.. భయంతో పరుగులు తీసిన జనాలు!