Sikandar Song: మామూలుగా స్టార్ హీరోల సరసన సీనియర్ హీరోయిన్లు నటిస్తే చూడడానికి కాస్త పరవాలేదనిపిస్తుంది. కానీ సీనియర్ హీరోల సరసన యంగ్ హీరోయిన్లు నటిస్తే కచ్చితంగా వారి పెయిర్‌పై ట్రోల్స్ రావడం ఖాయం. ప్రస్తుతం రష్మిక మందనా, సల్మాన్ ఖాన్ పెయిర్‌పై కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సల్మాన్‌తో నటించడానికి సీనియర్ హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నారు మేకర్స్. అలాంటిది ‘సికిందర్’ కోసం మురుగదాస్ మాత్రం రష్మికను రంగంలోకి దించాడు. కొన్నిరోజుల క్రితం విడుదలయిన టీజర్‌లో వీరి పెయిర్ ఎలా ఉందో తెలియకపోయినా.. తాజాగా విడుదలయిన పాటను చూసి వీరి పెయిర్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
మొదటి పాట
మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమానే ‘సికిందర్’. ప్రస్తుతం మురుగదాస్ దర్శకుడిగా ఫామ్‌లో లేడు. తన డైరెక్ట్ చేసిన గత సినిమాలు కూడా ఫ్లాప్‌గానే నిలిచాయి. దీంతో తన కమ్ బ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అలా సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘సికిందర్’తో కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. కానీ తాజాగా విడుదలయిన టీజర్‌కు మాత్రం అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సల్మాన్ ప్రతీ సినిమాలో ఉన్నట్టుగానే యాక్షన్ ఉందని, అంతకు మించి కొత్తగా ఏమీ అనిపించడం లేదని ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలయినా అవే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జోడీ బాలేదు
తాజాగా ‘సికందర్’ నుండి ‘జోహ్రా జబీన్’ అనే పాట విడుదలయ్యింది. అందులో రష్మిక లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ తెగ ప్రశంసిస్తున్నారు. లుక్స్ మాత్రమే కాదు.. డ్యాన్స్ కూడా చాలా క్యూట్‌గా చేసిందని అంటున్నారు. అంతా బాగానే ఉన్నా సల్మాన్, రష్మిక పెయిర్ మాత్రమే బాగా లేదని, చూడడానికి వయసులో చాలా తేడా ఉన్నట్టు తెలుస్తుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మామూలుగా సల్మాన్.. ఎప్పుడు యంగ్ హీరోయిన్స్‌తో జోడీకట్టడానికి ప్రయత్నించినా ఈ ఫన్నీ కామెంట్స్ తప్పవు. ‘సికిందర్’ విషయంలో కూడా మరోసారి అదే జరుగుతోంది. సల్మాన్ సరసన రష్మిక అస్సలు సెట్ అవ్వలేదని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
Also Read: గోల్డ్ స్మగ్లింగ్‌లో దొరికిపోయిన హీరోయిన్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
నెగిటివ్ కామెంట్స్
రంజాన్ పండగ అంటే థియేటర్లలో సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అదే విధంగా ఈ ఏడాది రంజాన్‌కు ‘సికందర్’ (Sikandar)తో వస్తున్నాడు ఈ సీనియర్ హీరో. కానీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి, టీజర్, పాటలు.. ఇలా ఏది విడుదలయినా కూడా దానికి ప్రేక్షకుల దగ్గర నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ ఏమీ రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే సల్మాన్ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా వచ్చినా.. మౌత్ టాక్ బాలేకపోతే కలెక్షన్స్‌పై మాత్రం దెబ్బపడే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. మామూలుగా సల్మాన్ సినిమాలు బాలేవని టాక్ వచ్చినా అవి కలెక్షన్స్ విషయంలో వెనక్కి తగ్గవు. ‘సికందర్’ కూడా అలాగే అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.