BigTV English

Body Moisturizers: శరీరానికి రాసే మాయిశ్చరైజర్లను చలికాలంలో ముఖానికి రాయవచ్చా? లేక ప్రత్యేకంగా ఫేస్ క్రీమ్ వాడాలా?

Body Moisturizers: శరీరానికి రాసే మాయిశ్చరైజర్లను చలికాలంలో ముఖానికి రాయవచ్చా? లేక ప్రత్యేకంగా ఫేస్ క్రీమ్ వాడాలా?
చలికాలంలో చర్మ సంరక్షణకు ప్రత్యేక ఉత్పత్తులు వాడాల్సిన అవసరం ఉంది. చాలామంది ముఖానికి ప్రత్యేకమైన ఫేస్ క్రీమ్ ను, ఫేస్ మాయిశ్చరైజర్ ను వాడుతూ ఉంటారు. అదే శరీరానికి సాధారణమైన మాయిశ్చరైజర్ ను వాడుతూ ఉంటారు. అయితే శరీరానికి బాడీ మాయిశ్చరైసర్ లేదా లోషన్ క్రీమ్ ను ముఖానికి కూడా రాయవచ్చా లేదా అనే సందేహం ఎక్కువమందిలో ఉంది. శరీరానికి రాసే మాయిశ్చరైజర్‌కు, ముఖానికి రాసే మాయిశ్చరైజర్‌కు తేడాను ముందుగా తెలుసుకోవాలి.


మన శరీరంలో ముఖ చర్మం మిగిలిన భాగాల కంటే పలుచగా ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ముఖానికి రాసే ఉత్పత్తులు సున్నితమైనవి, తేలికైనవి ఉంటాయి. అవి చర్మంలోకి లోతుగా వెళ్లి తేమవంతం చేస్తాయి. మొటిమలు, మచ్చల సమస్యలను తగ్గిస్తాయి. కానీ శరీరంలోని ఇతర భాగాల్లో ఉండే చర్మం చాలా మందంగా ఉంటుంది. ముఖానికి రాసే క్రీములు మిగతా శరీరానికి పెద్దగా పనిచేయవు.

శరీర చర్మం..  ముఖంపై ఉండే చర్మం కంటే మందంగా ఉంటుంది. అందుకే శరీరానికి రాసే మాయిశ్చరైజర్లు కూడా గాఢతను ఎక్కువగా కలిగి ఉంటాయి. తేలికైన మాయిశ్చరైజర్లు శరీరానికి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించకపోవచ్చు, సరైన రక్షణను అందించలేవు. బాడీ మాయిశ్చరైజర్ ప్రత్యేకంగా వాడాల్సిన అవసరం ఉంది. శరీరానికి సరైన హైడ్రేషన్ అవసరం. కాబట్టి బాడీ మాయిశ్చరైజర్ ను ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం ఉంది. అయితే శరీరానికి రాసే మాయిశ్చరైజర్ ను ముఖానికి రాయవచ్చా లేదా అనే సందేహానికి సమాధానాన్ని తెలుసుకుందాం.


శరీరానికి రాసే మాయిశ్చరైజర్‌ను ముఖానికి రాయకపోవడమే మంచిది. ఎందుకంటే బాడీ మాయిశ్చరైజర్ మందపాటి సాంద్రతను కలిగి ఉంటుంది. దీన్ని ముఖానికి రాస్తే ముఖంపై ఉండే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల మొటిమలు, మచ్చలు వంటివి అధికమైపోతాయి. అలాగే బాడీ మాయిశ్చరైజర్ సువాసన కూడా అధికంగా ఉంటుంది. ఇది ముఖంపై అలర్జీలకు కారణం అవుతుంది. బాడీ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే రసాయనాలు మీ ముఖ ఆకృతికి, చర్మానికి సరిపోకపోవచ్చు. ఇది దద్దుర్లు రావడానికి ఎరుపుగా మారడానికి కారణం అవుతుంది.

ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి మీరు బాడీ లోషన్ ముఖంపై వినియోగించకూడదు. వినియోగిస్తే చిన్నచిన్న గడ్డలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఫేషియల్ క్రీమ్‌ను ప్రత్యేకంగా కొనుక్కొని వాడాలి. పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారు బాడీ మాయిశ్చరైజర్ ను వాడడం వల్ల చర్మం ముదురు రంగులోకి మారిపోతుంది. ఇది దీర్ఘకాలంలో కనిపించే సమస్య. కాబట్టి వెంటనే ఎలాంటి సమస్య కనబడలేదు కాబట్టి  బాడీ మాయిశ్చరైజర్‌ని ముఖానికి కూడా రాసేస్తూ ఉంటారు ఎంతోమంది. ఆ పద్ధతిని వెంటనే మానేయండి. దీర్ఘకాలంలో మీ ముఖ చర్మంపై బాడీ మాయిశ్చరైజర్ ప్రతికూల ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి ముఖానికి ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ ను కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×