PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖ వచ్చారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. వేదికపై ఉన్నవారంతా మాట్లాడారు. అంతా బాగానే జరిగిందని భావిస్తున్నారు ఎన్డీయే నేతలు. స్టేజ్ దిగి వెళ్లేపోయే ముందు ప్రధాని మోదీ, వేదికపై ఉన్నవారి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టారు.
తొలుత పవన్ కల్యాణ్, ఆ తర్వాత లోకేష్, అనిత ఇలా అందరికీ నమస్కారం చేశారు. మంత్రి లోకేష్ వద్ద ఆగారు ప్రధాని మోదీ. వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. నీ మీద ఫిర్యాదు వచ్చిందని లోకేష్ తో అన్నారు ప్రధాని. ఆ కంప్లయింట్ ఏంటో మీకు తెలుసు కదా అని పక్కనే ఉన్న చంద్రబాబు వైపు చూసి చమత్కరించారు.
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయ్యిందని, ఢిల్లీ వచ్చి కూడా తనను ఎందుకు కలవలేదని మోదీ అన్నారు. ఫ్యామిలీతో ఢిల్లీకి వచ్చి తనను కలువు అంటూ లోకేష్ భుజం తట్టారు ప్రధాని. త్వరలో వచ్చి కలుస్తా సార్ అంటూ లోకేష్ రిప్లై ఇచ్చేశారు. ఇరువురి మధ్య సంభాషణను ఆసక్తిగా గమనించారు వేదికపైనున్న నేతలు.
ప్రధాని మోదీ లోకేష్‌ను ఢిల్లీకి రావాలని ఎందుకు కోరారు? ఏమైనా మతలబు ఉందా? ఎన్టీయే కీలకమంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ ప్రధాని మోదీని కలిసిన సందర్భాలున్నాయి. లోకేష్ ఇప్పటివరకు సమావేశం కాలేదని పిలిచినట్టు తెలుస్తోంది.
ALSO READ: చెడు జరుగుతుందని ముందే గ్రహించా.. అధికారులదే తప్పిదం.. టీటీడీ చైర్మన్
అదే క్రమంలో ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రి సత్యకుమార్‌ని పలకరించారు ప్రధాని మోదీ. ఆయన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. హెయిర్ లాస్ ఎలా అయ్యిందని చమత్కరించారు. ఈలోగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఆయన హార్డ్‌గా వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో స్టేజ్‌పైనున్న వారంతా ఒక్కసారిగా చిరు నవ్వు నవ్వుకున్నారు. అనంతరం స్టేజ్‌పై పెద్దలంతా దిగి వెళ్లిపోయారు.