Vegan Diet: చాలా మంది వేగన్ డైట్‌కి బాగా అలవాటు పడిపోయారు. ఈ డైట్ ఫాలో అవుతున్న వారు కేవలం మొక్కల నుంచి వచ్చే పోషకాహారం తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, గింజలు, ఆకుకూరలు మాత్రమే ఉంటాయి. గట్ హెల్త్‌ని కాపాడేందుకు ఈ రకమైన డైట్ సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట.
వేగన్ డైట్ చేసినప్పుడు గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసాహారాలతో పాటు జంతు ఉత్పత్తులను పూర్తిగా దూరం పెడతారు. ఈ రకమైన డైట్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా చేయడం నుంచి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేయడం వరకు వేగన్ డైట్ సహాయపడుతుందని అంటున్నారు.
ALSO READ: చికెన్ నిల్వ పచ్చడి ఇలా చేయండి
ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడే బిఫిడోబాక్టీరియం, లాక్టోబాసిల్లస్ వంటి గట్ బ్యాక్టీరియాను పెరిగేలా చేయడానికి కూడా వేగన్ డైట్ హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలోని మలినాలు తలగిపోతాయట. అంతేకాకుండా జీవక్రియ కూడా మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి..?
వేగన్ డైట్ ఫాలో కావడం వల్ల శరీరానికి చాలా తక్కువ మొత్తంలో శాచురేటెడ్ ఫ్యాట్స్, కేలరీలు అందుతాయి. మాంసాహారం, ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తే జీర్ణక్రియకు కూడా చాలా తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. వేగన్ డైట్ తీసుకుంటే ఎక్కువగా ఫైబర్ కంటెంట్ శరీరంలోకి వెళ్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు ఇది సహాయపడుతుందట. ఈ రకమైన డైట్ ఫాలో అవ్వడం వల్ల ఊబకాయం సమస్య తొలగిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బుల వంటివి వచ్చేలా చేసే కారకాలను తగ్గించడంలో కూడా వేగన్ డైట్ కీలక పాత్ర పోషిస్తుందట.
వేగన్ డైట్ వల్ల వీక్ అయిపోతారా..?
వేగన్ డైట్ ఫాలో కావడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందవని కొందరు చెబుతారు. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడే ఛాన్స్ ఉందనే వాదన కూడా ఉంది. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వేగన్ డైట్ ఫాలో అయినప్పటికీ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్‌తో పాటు విటమిన్స్ మినరల్స్ అందుతాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషణ అందించడంలో ఈ డైట్ సహాయపడుతుందని చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని డాక్టర్లు చెబుతున్నారు. పైగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి బాడీని ఫిట్‌గా ఉంచేందుకు ఈ రకమైన ఆహారం సహాయపడుతుందట.