TDP vs YSRCP : ఈ విషయం చాలామందికి గుర్తే ఉంటుంది. అది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న సమయం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వాళ్లే పోరాటం చేస్తున్నారు. రెండు ప్రాంతాలూ రెండు కళ్లు అంటూ టీడీపీ సంయమనం పాటిస్తున్న రోజులు. వైసీపీ అధినేత జగన్ మాత్రం సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. అది తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. ఓదార్పు యాత్ర కోసం హైదరాబాద్ నుంచి రైల్లో.. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ బయలు దేరారు. జగన్‌ను వరంగల్ బోర్డర్ కూడా టచ్ చేయనీయకుండా.. ఆ రైలును పట్టాలపైనే అడ్డుకున్నారు ఆనాటి ఉద్యమకారులు. చేసేది లేక జగన్ వెనుదిరిగి వెళ్లిపోయారు. తెలంగాణలో తన పార్టీని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీకే పరిమితమయ్యారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే….
జగన్ హెలికాప్టర్‌ను.. సునీత సవాల్
సేమ్ టు సేమ్ అలాంటిదే కాకున్నా.. సుమారుగా ఆనాటి పరిణామాన్ని తలపించేలా ఏపీలో వాడివేడి రాజకీయం నడుస్తోంది. తోపుదుర్తి వర్సెస్ పరిటాల. మధ్యలో జగన్. ట్రయాంగిల్ ఫైట్ అనంత జిల్లాను రగిలిస్తోంది. వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మంగళవారం జిల్లాకు వస్తున్నారు జగన్. తాను తలుచుకుంటే జగన్ ఎక్కిన హెలికాప్టర్‌ను దిగకుండా తిరిగి పంపే శక్తి తనకుందంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు పరిటాల సునీత. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారని పరోక్షంగా హింట్ ఇచ్చారు. జగన్‌ను రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ తమకు ఉన్నాయని.. తమలో ఉన్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల బ్లడ్ అంటూ సీమ ప్రతాపం చూపించారు పరిటాల. గతంలో పరిటాల రవి బతికి ఉన్నప్పుడు.. పులివెందులకు వెళ్తే కాన్వాయ్‌ను అడ్డుకున్నారని.. వాహనాలు తనిఖీ చేసి కేవలం 3 వెహికిల్స్‌కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారని ఆనాటి అవమానాన్ని గుర్తు చేశారు. బదులుకు బదులు తీర్చుకుంటాం అనేలా సునీత సంచలన కామెంట్స్ చేశారు.
అనంతలో మంగళవారం టెన్షన్
పరిటాల సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాక రేపుతున్నాయి. అన్నట్టుగానే పరిటాల సైన్యం జగన్ హెలికాప్టర్‌ను దిగకుండా అడ్డుకుంటుందా? ఆయన కాన్వాయ్ ముందుకు కదలకుండా చెక్ పెడుతుందా? ఆనాడు రవిని అడ్డుకున్నట్టే.. ఇప్పుడు జగన్‌కు అడుగడుగునా ఆటంకాలు తప్పవా? మంగళవారం అనంత గడ్డపై ఏదో జరగనుందా? అనే టెన్షన్ టెన్షన్.
Also Read : ఆ హీరోయిన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో
పరిటాల మాటలకు అర్థాలే వేరులే?
ఈ సందర్భంగా సునీత మరో ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు. జగన్ రెడ్డిని అడ్డుకోవాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే చూస్తున్నాడని ఆరోపించారు. జగన్‌ను అడ్డుకుని.. రెచ్చగొట్టి రాజకీయం చేయాలని వైసీపీ వాళ్లే స్కెచ్ వేశారనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎవరూ ఈ విషయంలో సంయమనం కోల్పోవద్దని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తమకు అలాంటి సంస్కృతి నేర్పలేదని అన్నారు పరిటాల సునీత. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడని.. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేసి వెళ్లిపోవాలని అన్నారు.