Akhil Akkineni: సినీ సెలబ్రిటీల బర్త్ డే వచ్చిందంటే చాలు.. వారికి సంబంధించిన అప్‌కమింగ్ సినిమాల అప్డేట్స్ విడుదల అవ్వడం చాలా కామన్. అలాగే ఏప్రిల్ 8న అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని మేకర్స్ ముందే ప్రకటించారు. కానీ బర్త్ డేకు ఒకరోజు ముందే ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం అక్కినేని హీరోల్లో అఖిల్‌కు హిట్ చాలా అవసరం. హీరోగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనకు ఒక్క హిట్ కూడా లేదు. అందుకే తన కెరీర్‌లో 6వ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. దానికోసం ఒక డిఫరెంట్ జోనర్‌ను ఈ హీరో ఎంచుకున్నాడని అర్థమవుతోంది.
చిన్న గ్లింప్స్
సితార ఎంటర్‌టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు కలిపి అఖిల్ 6వ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ఏప్రిల్ 8నే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నా కూడా దానికి ఒకరోజు ముందే చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకు అఖిల్ అప్‌కమింగ్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇండస్ట్రీ వినిపిస్తున్న కథనాలనే ఫ్యాన్స్ వింటూ వచ్చారు. అయితే తాజాగా విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే ఇదొక యాక్షన్ మూవీ అని, దీంతో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ చేయని ప్రయోగాన్ని చేస్తున్నాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఓ ప్రేమకథ
‘‘ప్రేమ కంటే ఏ యుద్ధం కూడా వైలెంట్ కాదు’’ అంటూ అఖిల్ చేతిని చూపిస్తూ ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దీనిని చూస్తుంటే ఇదొక రొమాంటిక్ డ్రామా అయినా ఇందులో చాలా యాక్షన్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. మొత్తానికి ఇప్పుడే అఖిల్ అప్‌కమింగ్ మూవీపై భారీగా అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఈ మూవీ హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇక మూవీ లవర్స్ సైతం ఈసారి ఈ అక్కినేని హీరో ఏదో ఒక ప్రామిసింగ్ స్టోరీతో వస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఖిల్ హీరోగా అయిదు సినిమాల్లో నటించినా అవన్నీ ఒకదానికి మించి మరొకటి డిశాస్టర్ అయ్యాయి.
Also Read: ‘స్పిరిట్’ స్టోరీ ఇదే.. థియేటర్లు బ్లాస్ట్ పక్కా అంటున్న డైరెక్టర్
భారీ డిశాస్టర్
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) చివరిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమాలో కనిపించాడు. ఇందులో అఖిల్‌తో పాటు మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే భారీ డిశాస్టర్‌ను అందుకుంది. ఈ మూవీపై అఖిల్ మాత్రమే కాదు.. అక్కినేని అభిమానులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నా వారి అంచనాలను కొంచెం కూడా అందుకోలేకపోయింది. పైగా ఇందులో అఖిల్ యాక్టింగ్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు ప్రేక్షకులు. అందుకే తన తరువాతి సినిమా కోసం తొందరపడకుండా సమయం తీసుకొని ఒక రిఫ్రెషింగ్ స్టోరీతో అందరి ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
With all my heart…
Presenting it to you all tomorrow.#Akhil6 pic.twitter.com/pi8F9XqNRp— Akhil Akkineni (@AkhilAkkineni8) April 7, 2025