క్యారెట్లు, టమోటాలు రెండు కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఇక్కడ మేము ఆ రెండింటితో టేస్టీ స్పైసీ పచ్చడి ఎలా చేయాలో చెప్పాము. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే సైడ్ డిష్ గా కూడా దీన్ని తినవచ్చు. ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా ఈ చట్నీని తింటే టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ రెసిపీ కూడా చాలా సులువు.
క్యారెట్ టమోటో చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యారెట్లు – మూడు
టమోటోలు – మూడు
ఉప్పు – రుచికి సరిపడా
చింతపండు – ఉసిరికాయ సైజులో
నువ్వులు – ఒకటిన్నర స్పూను
ఎండుమిర్చి – నాలుగు
జీలకర్ర – ఒక స్పూను
ధనియాలు – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఏడు
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
క్యారెట్ టమాటో చట్నీ రెసిపీ
– క్యారెట్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
– స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
– ఆ నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
– ఇప్పుడు అదే కళాయిలో మరొక స్పూన్ నూనె వేసి క్యారెట్లను వేసి వేయించాలి.
– క్యారెట్లు ఐదు నిమిషాలు వేగాక టమోటో ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
– ఇప్పుడు మిక్సీ జార్లో క్యారెట్లు, టమోటోలు, చింతపండు ముందుగా వేయించి పెట్టుకున్నా నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
– ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోవాలి.
– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
– ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.
– రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.
– ఈ మొత్తం మిశ్రమాన్ని చట్నీపై తాళింపులా వేసుకోవాలి.12. అంతే టేస్టీ క్యారెట్ టమోటో పచ్చడి రెడీ అయినట్టే.
– మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి సంఖ్యను పెంచినా చాలు.
పెద్ద వాళ్లకు ఇది స్పైసీగా ఉంటే నచ్చుతుంది. అదే పిల్లలకైతే సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని కేవలం అన్నంతోనే కాదు ఇడ్లీతో, దోశతో కొన్నా రుచిగా ఉంటుంది. ఊతప్పంతో కూడా దీన్ని తినవచ్చు. ఒక్కసారి మీరు దేన్నీ తిన్నారంటే దీని రుచి మీకు ఎంతో నచ్చుతుంది.
Also Read: క్యారెట్లతో బాదుషా చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగోండి
దీనిలో మనం వాడినవి ప్రధానంగా టమోటోలు క్యారెట్లు ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవి. టమోటోలు ప్రతిరోజూ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. టమోటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. ఇక క్యారెట్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఏ విటమిన్ కంటి చూపుకు ముఖ్యమైనది. క్యారెట్లు ఎన్ని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టమోటాలు క్యారెట్లు రెండు కూడా మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఈ పచ్చడి కూడా ఆరోగ్యానికి మేలు చేసేదే.