BigTV English

Pushpa 2 OTT : “పుష్ప 2” ఓటిటి పార్ట్ నర్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Pushpa 2 OTT : “పుష్ప 2” ఓటిటి పార్ట్ నర్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Pushpa 2 OTT : దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన “పుష్ప 2 (Pushpa 2)” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ ఎలా ఉంది ? అని ఓవైపు చర్చలు నడుస్తుండగా… మరోవైపు ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? అనే ఆసక్తికరమైన టాక్ మొదలైంది. మరి ఈ ఏడాది మోస్ట్ హైప్డ్ మూవీ అయిన “పుష్ప 2 : ది రూల్” ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ?అనే విషయాలను చూసేద్దాం పదండి.


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప 2 (Pushpa 2) ‘. ‘పుష్ప ది రైజ్’ పేరుతో రిలీజ్ అయిన మొదటి పార్ట్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తెలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి సీక్వెల్ గా గత మూడు ఏళ్ల నుంచి ‘పుష్ప ది రూల్’ అనే ఈ మూవీని చెక్కుతున్నాడు సుక్కు. ఎన్నో అడ్డంకులు దాటుకొని ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న బిగ్ స్క్రీన్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఎలా ఉంది? అనే చర్చ నడుస్తుంది.

ఇప్పటికే సినిమాను బెనిఫిట్ షో, పెయిడ్ ప్రీమియర్ల ద్వారా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చర్చ నడుస్తోంది. ‘పుష్ప 2 (Pushpa 2)’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ అన్న విషయాన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని దాదాపు 270 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక సాధారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. మరి ‘పుష్ప 2 (Pushpa 2)’ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ సంగతేంటి? అంటే…


ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న హైప్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. సినిమా థియేట్రికల్ గా లాంగ్ రన్ లో ఆడితేనే, అది కూడా సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే నిర్మాతలు లాభాల బాట పడతారు. కాబట్టి కనీసం 8 వారాలైనా పడుతుంది ‘పుష్ప 2 (Pushpa 2) ‘ ఓటిటిలోకి రావడానికి. మొత్తానికి సంక్రాంతి వరకు ఈ సినిమా బాగుంటే థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా సంక్రాంతికి లేదంటే సమ్మర్ కి ఓటిటిలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీని ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇక ‘పుష్ప 2’ మూవీ పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు కొల్లగొట్టాడు పుష్పరాజ్. మరి మూవీకి ఈరోజు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×