BigTV English

Causes Of Paralysis: పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా ?

Causes Of Paralysis: పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా ?

Causes Of Paralysis: ప్రస్తుతం చాలా మంది పక్షవాతంతో బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చింది అంటే చెట్టంత మనిషి కూడా ఉన్నట్టుండి కూలిపోవాల్సిందే. తీవ్రమైన ప్రాణాంతక వ్యాధిగా కూడా ఇది మారుతోంది. ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపించేది. కానీ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా పక్షవాతం వస్తోంది. చిన్న వయస్సులోనే పక్షవాతం రావడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.


ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపించడం కారణంగా పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. అసలు ఆ విటమిన్ ఏది పక్షవాతం రావడానికి ఎందుకు కారణం అవుతోంది. అన్న విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మన శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా పని చేయడంలో విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి 12 గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. దీని నేత కోబాలమిన్ అని కూడా చెబుతుంటారు. ఇది శరీరంలో నాడీవ్యవస్థను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి విటమిన్ బి 12 లోపం ఏర్పడితే అది నరాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. క్రమంగా ఇది పక్షవాతం రావడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి 12 లోపిస్తే అది బెరిబెరి వ్యాధికి కారణం అవుతుంది అంటున్నారు.


ఇది నరాలు దెబ్బ తీయడానికి, కండరాల బలహీనతకు కారణం అవడంతో పాటు ఇది తీవ్రమైన పరిస్థితుల్లో పక్షవాతానికా కూడా కూడా దారితీస్తుంది. అయితే బెరిబెరి వ్యాధిలో రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఒకటి పొడి బెరిబెరి డిసీజ్. ఇది చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోవడం, కండరాల బలహీనత, కాళ్లను కదిలించడంలో సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు పెరాలసిస్ రావడానికి కూడా ఇది దారి తీస్తుంది.

విటమిన్ బి 12 లోపం వల్ల వ్యక్తులకు పక్షవాతం వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉంటుంది. తడి బెరిబెరి వ్యాధి ఇది హృదయనాళ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అదే విధంగా శరీరంలో విటమిన్ బి లోపం వస్తే వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్ సమస్యకు ఇది దారితీస్తుంది. ఇది బ్రెయిన్ దెబ్బ తినడానికి కారణమయ్యే నాడీ సంబంధిత సమస్య. కాబట్టి మీరు తినే ఆహారంలో విటమిన్ బీ 12 తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

ముఖ్యంగా పెద్దవారిలో నాడీ కణాలు వాటిని రక్షించే కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బి 12 అవసరం అని నిపుణులు చెబుతున్నారు. నరాలు, కండరాలు, గుండె పనితీరును మెరుగు పరచడంలో కూడా ఈ విటమిన్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే బాడీలో పోషకాలను శక్తిగా మార్చడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×