BigTV English

New Year 2025 Recipes: కొత్త సంవత్సరానికి తీపి స్వాగతం.. ఈ వెరైటీస్​‌తో పార్టీ అద్దిరిపోద్ది!

New Year 2025 Recipes: కొత్త సంవత్సరానికి తీపి స్వాగతం.. ఈ వెరైటీస్​‌తో పార్టీ అద్దిరిపోద్ది!

New Year 2025: మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం అవ్వబోతోంది. అయితే ఈ కొత్త సంవత్సరం అంటే.. సెలబ్రేషన్స్‌తో పాటు రుచికరమైన వంటకాలు ఉండాల్సిందే.. ఎలాంటి ప్రత్యేక సందర్బం అయినా రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. మరి న్యూయర్ రోజు ఎలా వదిలేస్తాం. ఇంటికి వచ్చిన అతిథులు, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే.. ఆ మజానే వేరు కదా.. ఈ న్యూయర్‌ని మరింత స్పెషల్‌గా ఉండాలంటే.. ఈ రుచికరమైన టేస్టీ రెసిపీలు తయారు చేసుకోండి. టేస్ట్ అద్దిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


సోహన్ హల్వా..
సౌత్‌లో బాగా ఫేమస్ అయిన మొగల్స్ ట్రెడీషనల్ రెసిపీ సోహన్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సన పదార్ధాలు
పావు కప్పు నెయ్యి
కప్పు పంచదార
మైదా
మిల్క్ పౌడర్
డ్రై ఫ్రూట్స్

తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడెక్కినాక.. కప్పు పంచదార వేయండి. మంట లో ఫ్లేమ్‌లో ఉంచి పంచదారను కరగనివ్వాలి. ఇప్పుడు వేరే బౌల్‌లో నాలుగు టేబుల్ స్పూన్ మైదా, అలాగే మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత కలుపుకున్న పౌడర్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ పలుకులు వేయాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని బౌల్‌లో వేసుకుని అరగంట పాటు ఉంచి తర్వాత తీయండి. ఎంతో టేస్టీగా, క్రంచీగా ఉండే సోహన్ హల్వా రెడీ అయినట్లే..


Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

నెయ్యప్పమ్
తమిళనాడు, కేరళ స్పెషల్.. చాలా క్యూట్‌గా, టెప్టింగా ఉండే నెయ్యప్పమ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి కప్పు
బెల్లం ముప్పావు కప్పు
కప్పు నీళ్లు
గోధుమ పిండి
టీ స్పూన్ యాలుకల పొడి,
అరటీ స్పూన్ వంట సోడా

తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో ముప్పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించి దింపి పూర్తిగా చల్లార్చండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో కప్పు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి, టీ స్పూన్ యాలుకల పొడి, టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోండి. ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం పానకం వడకట్టి పోసి, బాగా కలపండి. ఆ తర్వాత నీళ్లు కలుపుతూ దోస పిండి మాదిరిగా.. ఉండలు లేకుండా కలుపుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. బాగా కాగుతున్న నూనెలో గరిటెడు చొప్పున కలుపుకున్న మిశ్రమాన్ని వేసి.. రెండు వైపుల బాగా వేయించండి. అంతే సింపుల్ ఎంతో రుచికరమైన టేస్టీ నెయ్యప్పమ్ రెడీ అయినట్లే..

 

Related News

Symptoms In Legs: కాళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

Anti Aging Tips: వయస్సు పెరుగుతున్నా.. యవ్వనంగా కనిపించాలంటే ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Big Stories

×