Rice Water For Skin: ఈ రోజుల్లో వివిధ రకాల ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మీ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా మార్చగలిగే సహజ పదార్థాలు మీ వంటగదిలోనే ఉంటాయని మీకు తెలుసా ? అవును మీ వంటగదిలో ఉండే బియ్యం నీరు మీ ముఖ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా నేడు చాలా మంది బియ్యం నీళ్లను చర్మ,జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి వాడుతున్నారు. రైస్ వాటర్ ముఖానికి గ్లాస్ స్కిన్ లాంటి మెరుపును ఇస్తాయి. బియ్యం నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం ద్వారా అనేక మార్పులు కనిపిస్తాయి. మరి ముఖం కాంతివంతగా మార్చుకోవడానికి బియ్యం నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుదాం.
బియ్యం నీరు వాటడం వల్ల కలిగే లాభాలు:
బియ్యం కడిగినప్పుడు వచ్చే నీటిని రైస్ వాటర్ అంటారు. ఇందులో విటమిన్ బి, ఇ, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజుకు రెండుసార్లు బియ్యం నీటితో ముఖం కడుక్కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: బియ్యం నీళ్లలో ఉండే స్టార్చ్ మీ చర్మానికి పోషణనిచ్చి మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మం యొక్క సహజ మెరుపును తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది.
చర్మాన్ని మృదువుగా చేస్తుంది: బియ్యం నీరు మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది .
చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది: బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మీ ముఖం యొక్క రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మీ చర్మాన్ని బిగుతుగా , దృఢంగా చేస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది: బియ్యం నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు తగ్గించడంతో పాటు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:బియ్యం నీరు మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది: బియ్యం నీరు మీ చర్మం యొక్క ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. ఇది మీ చర్మానికి సమానమైన టోన్ ఇవ్వడంలో సహాయపడుతుంది.
వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది: బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అంతే కాకుండా ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.
బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి ?
ఫేషియల్ క్లెన్సర్‌గా- బియ్యం నీళ్లతో ముఖం కడుక్కోండి.
టోనర్‌గా- స్ప్రే బాటిల్‌లో బియ్యం నీటిని నింపి మీ ముఖంపై స్ప్రే చేయండి.
ఫేస్ మాస్క్‌గా: బియ్యం నీటిని కాటన్ క్లాత్‌లో నానబెట్టి మీ ముఖానికి అప్లై చేయండి.
ఐస్ క్యూబ్స్ రూపంలో- ఒక ఐస్ ట్రేలో రైస్ వాటర్ ఫ్రీజ్ చేసి, ఆపై మీ ముఖం మీద రుద్దండి.
ఎన్ని సార్లు ఉపయోగించాలి ?
మీరు రోజుకు రెండుసార్లు బియ్యం నీటితో మీ ముఖాన్ని కడగవచ్చు. మీ చర్మం సున్నితంగా ఉంటే మీరు దీన్ని వారానికి రెండు-మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలి.
Also Read: హెన్నా అవసరమే లేదు.. ఈ హెర్బల్ హెయిర్ కలర్‌తో క్షణాల్లోనే తెల్లజుట్టు మాయం
ఏ విషయాలు గుర్తుంచుకోవాలి ?
బియ్యం నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ద్వారా 2-3 రోజులు ఉపయోగించవచ్చు.
మీకు బియ్యం నీరు అలెర్జీ అయితే ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.
ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను బియ్యం నీటితో కూడా ఉపయోగించవచ్చు.