E-Paper
Advertisement

మౌనంగా ఉండడం మీకు అలవాటుగా మారిందా? ఈ 5 నష్టాలకు అదే కారణం.. ఈ పరిస్థితుల్లో నోరు విప్పాల్సిందే

మౌనంగా ఉండడం మీకు అలవాటుగా మారిందా? ఈ 5 నష్టాలకు అదే కారణం.. ఈ పరిస్థితుల్లో నోరు విప్పాల్సిందే
Advertisement

చాలామంది మౌనం తెలివి, పరిపక్వతకు చిహ్నం అని భావిస్తారు. ప్రాచీన తత్వవేత్త చాణక్యుడు కూడా పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు మౌనంగా ఉండాలని చెప్పాడు. కానీ అన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. తక్కువగా మాట్లాడటం అనవసరమైన గొడవలను దూరం చేస్తుంది. అయితే, అతిగా మౌనంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ ఆలోచనలు, భావాలు ఇతరులకు తెలియకపోవడంతో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చాణక్యుడి ప్రకారం.. మన భావాలను వ్యక్తపరచకుండా ఉండే మౌనం మనకే నష్టాన్ని కలిగిస్తుంది.

మీ అభిప్రాయం అడగడం మానేస్తారు

మన అనుభవం, జ్ఞానం మన అభిప్రాయాల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైన తమకు నమ్మకం ఉన్నవారి సలహాలను కోరుతుంటారు. కానీ ఎల్లప్పుడూ మౌనంగా ఉంటే.. మీకు ఆసక్తి లేదని లేదా చెప్పడానికి ఏమీ లేదని ఇతరులు భావించవచ్చు. దీంతో మీ అభిప్రాయం అడగడం క్రమంగా తగ్గించేస్తారు. సరైన సమయంలో మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల ఇతరులకు మీ పట్ల గౌరవం పెరుగుతుంది.

మీ తరఫున ఇతరులే నిర్ణయాలు తీసుకుంటారు

Advertisement

ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విషయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని స్పష్టంగా చెప్పకపోతే ఇతరులు ఊహించుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు. దీంతో మీ అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేస్తారు. కాబట్టి మీకు నచ్చినవి, నచ్చనివి ధైర్యంగా చెప్పడం అవసరం. ఇది మీ స్వేచ్ఛ, హక్కులను కాపాడుతుంది.

మీ మనోభావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు

చాలామంది బాధ, నిరాశ లేదా అసంతృప్తిని బయటపెట్టరు. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మనోభావాలను దాచిపెట్టడం వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ మనసును అర్థం చేసుకోలేరు. నమ్మకమైన వ్యక్తులతో మన భావాలను పంచుకోవడం వల్ల బంధాలు మరింత బలపడతాయి.

మీ కష్టానికి గుర్తింపు దక్కకపోవచ్చు

Advertisement

కష్టానికి తగిన గుర్తింపు దక్కాలి. కానీ మీరు చేసిన పనిని ఎప్పుడూ చెప్పకపోతే, ఆ ప్రశంసలు ఇతరులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది స్వీయప్రచారం చేయమని కాదు. అవసరమైనప్పుడు మీ విజయాలను చెప్పడం ద్వారా సరైన గుర్తింపు పొందవచ్చు. ఇది కెరీర్‌కు, ఆత్మవిశ్వాసానికి కూడా ఉపయోగపడుతుంది.

తప్పును వ్యతిరేకించే ధైర్యం తగ్గిపోతుంది

అన్యాయాన్ని చూసినా మౌనంగా ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. చాలా మంది మౌనాన్ని అంగీకారంగా భావిస్తారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు లేదా హానికరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని మర్యాదపూర్వకంగా వ్యతిరేకించడం అవసరం. చాణక్యుడు కూడా అన్యాయాన్ని ఎప్పుడూ ప్రశ్నించాలని చెప్పాడు.

Also Read: ఫాదర్స్ డే 2026.. పిల్లల కోసం ప్రతి తండ్రి నిశ్శబ్దంగా చేసే 7 త్యాగాలు..

సరైన సమతుల్యత అవసరం

మౌనం, మాట రెండింటికీ ప్రత్యేకమైన విలువ ఉంది. ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరమైనప్పుడు మాట్లాడటం, భావాలను నిజాయితీగా పంచుకోవడం, అన్యాయాన్ని ఎదిరించడం వల్ల మంచి సంబంధాలు, గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సరైన సమయంలో చెప్పిన మాటలు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×