Chocolate Day 2025: చాక్లెట్ డేను వాలెంటైన్ వీక్‌లో మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజుప్రేమికులు తమ భాగస్వామికి చాక్లెట్లను ఇస్తారు. చాక్లెట్లు ఇవ్వడం ద్వారా ఒకరి నోరు ఒకరు తీపి చేసుకుంటారు. ప్రేమికులకు చాక్లెట్లను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఇంతకీ చాక్లెట్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
చాక్లెట్ డే చరిత్ర:
16వ శతాబ్దంలో ఐరోపాలో చాక్లెట్ బాగా ప్రాచుర్యం పొందింది. క్రమంగా చాక్లెట్ ప్రేమ ప్రతిపాదనలు , ప్రత్యేక సందర్భాలలో ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు.
చాక్లెట్ రుచి చేదుగా ఉండేది:
గతంలో చాక్లెట్ రుచి చేదుగా ఉండేది. అమెరికాలో, కోకో గింజలను రుబ్బి కొన్ని మసాలా దినుసులు , మిరపకాయలను కలపడం ద్వారా హాట్ చాక్లెట్ తయారు చేసేవారు. 2000 సంవత్సరంలో అమెరికాలోని వర్షారణ్యాలలో కోకో చెట్టు కనుగొన్నారు. ఆ చెట్టు గింజల్లో లభించే విత్తనాలతో చాక్లెట్ తయారు చేసేవారు. చాక్లెట్ ను మధ్య అమెరికా , మెక్సికో నుండి వచ్చిన ప్రజలు ఉత్పత్తి చేశారని చెబుతారు. తరువాత చాక్లెట్ స్పెయిన్‌లో , తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని వాలెంటైన్స్ వీక్‌లో చేర్చడం వెనక ఉద్దేశ్యం సంబంధాలను తీపి , ప్రేమతో నింపడం.
చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం, ప్రాముఖ్యత
చాక్లెట్ తీపి రుచి ప్రేమ , స్నేహంలోని మాధుర్యాన్ని కూడా సూచిస్తుంది. ఈ రోజు ప్రేమికులు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి , అపార్థాలను తొలగించు కోవడానికి అవకాశం ఇస్తుంది. చాక్లెట్ తినడం వల్ల సెరోటోనిన్ , డోపమైన్ అనే సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఆనందాన్ని అందిస్తాయి.
మీరు మీ ప్రేమికులకు మీ భావాలను వ్యక్త పరచాలనుకుంటే, చాక్లెట్ డే నాడు వారికి చాక్లెట్లు ఇవ్వడం ద్వారా ప్రేమను తెలియజేయండి.
చాక్లెట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడం ద్వారా, మీరు మీ భాగస్వామి లేదా స్నేహితులకు మంచి అనుభూతిని కలిగించవచ్చు.
సాధారణంగా అందరూ చాక్లెట్లు తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే చాక్లెట్లను ప్రేమికులకు ఇవ్వడం అనేది ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతుంది. మరి మీరు ప్రేమించే వారికి మీరు కూడా చాక్లెట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటే గనక కొన్ని ప్రత్యేకమైన చాక్లెట్లు ఇవ్వండి. ఇవి మీ ప్రేమను తెలియజేయడంలో మీకు ఉత్తమ ఎంపిక.
Also Read: బ్లాక్ కాఫీ తాగుతున్నారా ? అయితే డెంజర్‌లో పడ్డట్లే !
హార్ట్ షేప్ చాక్లెట్లు:
మీరు మీ భాగస్వామికి హార్ట్ షేప్‌లో ఉన్న చాక్లెట్లను కూడా ఇవ్వవచ్చు. అంతే కాకుండా వీటితో పాటు ఒక గులాబీని కూడా ఇచ్చి మీ ప్రేమను తెలియజేయండి. వారు చాలా సంతోషిస్తారు.
చాక్లెట్ బొకే:
ప్రస్తుతం చాక్లెట్ బొకే ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఈ గిఫ్ట్ మీ భాగస్వామికి ఇస్తే.. చాలా సంతోషిస్తారు. అంతే కాకుండా ఆ గిఫ్ట్ ప్రత్యేకంగా కూడా ఉంటుంది.
చాక్లెట్ బకెట్:
మీరు మీ భాగస్వామికి చాక్లెట్ బకెట్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. చాక్లెట్ బకెట్ కూడా ఒక రకమైన బహుమతి దీనిలో మీరు వివిధ రకాల చాక్లెట్లను బొమ్మలను పెట్టెలో పెట్టి కూడా ఇవ్వవచ్చు.