BigTV English

Black Coffee: బ్లాక్ కాఫీ తాగుతున్నారా ? అయితే డెంజర్‌లో పడ్డట్లే !

Black Coffee: బ్లాక్ కాఫీ తాగుతున్నారా ? అయితే డెంజర్‌లో పడ్డట్లే !

Black Coffee: కాఫీ తాగడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కాఫీ తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే కాఫీ తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే మీకు గనక కాఫీ తాగే అలవాటు ఉంటే మాత్రం పాలతో తయారు చేసిన కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ త్రాగడం అలవాటు చేసుకోండి. బ్లాక్ కాఫీ త్రాగడం వల్ల మానసిక స్థితి ఏకాగ్రత కూడా మెరుగు పడటంతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని రుజువైంది. కాఫీ త్రాగడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు కూడా పొందవచ్చు.


బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో తాగడం వల్ల అనేక కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలా అని బ్లాక్ కాఫీ అధికంగా తాగినా కూడా హానికరం అని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ దీని గురించి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి.

కాఫీ త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


బ్లాక్ కాఫీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా రెండు నుండి మూడు కప్పుల కాఫీ త్రాగితే అది కాలేయ వ్యాధుల ప్రమాదం నుండి రక్షిస్తుంది, అంతే కాకుండా మెదడుకు సంబంధించిన అనేక రకాల వ్యాధుల నుండి కూడా బయటపడేలా చేస్తుంది. కాఫీలో వివిధ రకాల ప్రభావ వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుండి కూడా నివారిస్తుంది.

కాఫీ త్రాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా నిరాశ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వెల్లడైంది. మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కాఫీని ప్రతి రోజు తీసుకోవడం మంచిది.

కాఫీ పరిమిత పరిమాణం తీసుకోవాలి ?
కాఫీ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు , ఆందోళన , బ్లడ్ ప్రెషర్ వంటివి కూడా పెరుగుతాయి. అధిక మొత్తంలో కాఫీ త్రాగడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

మీరు బ్లాక్ కాఫీకి బానిసయ్యారా ?

పని చేస్తున్నప్పుడు రిఫ్రెష్‌గా ఉండటానికి ఎక్కువగా ఎక్కువ సార్లు కాఫీ తాగడానికి అలవాటు పడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరానికి, మనస్సుకు తక్షణ శక్తినిచ్చే బ్లాక్ కాఫీని అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం.

బ్లాక్ కాఫీలో అధిక మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి తరచుగా కాఫీ తీసుకోవడం వల్ల వ్యసనం లాగా మారిపోతుంది. అంతే కాకుండా శరీరంలో అధిక మోతాదులో ఉండే కెఫిన్ నిద్రలేమికి కారణం అవుతుంది. నిద్ర నాణ్యతను ప్రభావితం చేయడంలో కెఫిన్ ముందుంటుంది. అంతే కాకుండా ఇది కడుపు, చికాకు, గ్యాస్ వంటి సమస్యలను కూడా పెంచుతుంది.

Also Read: మీకు తెలుసా? నోటిలోని బ్యాక్టీరియాతో ఆ వ్యాధిని ముందే పసిగట్టేయొచ్చట !

ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:

1. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఒత్తిడితో పాటు ఆందోళన కూడా పెరుగుతుంది.

2.కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా తగ్గుతుంది. గుండె వేగంగా కూడా కొట్టుకుంటుంది. బ్లాక్ కాఫీ అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారు దీనిని తక్కువగా తీసుకోవాలి.

3. కాఫీ కాలేయానికి చాలా మేలు చేస్తుంది. మీరు బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తే మాత్రం ఇది పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది.
రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ త్రాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబతుతున్నారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×