SS.Thaman:చిన్న హీరో అయినా.. పెద్ద హీరో అయినా.. యంగ్ హీరోల నుండి మొదలు సీనియర్ హీరోల వరకు ఎవరి సినిమా అయినా సరే మాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనే కావాలి అంటున్నారు. ఆయనే మా సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలి అంటున్నారు. మరి ఇంతకీ ఆయన ఎవరో కాదు ఎస్.ఎస్.తమన్ (S.S.Thaman ). ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఎస్.ఎస్ తమన్.. చాలామంది కాపీ కంటెంట్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినప్పటికీ చాలామంది దర్శక నిర్మాతలు, హీరోలు మాత్రం ఈయన్నే తమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటారు. అలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎస్.ఎస్.తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా అన్న వాళ్ళే నన్ను మోసం చేశారు. డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మరి ఇంతకీ తమన్ (Thaman)ని మోసం చేసి డబ్బులు దొబ్బేసింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ..
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లుగా కీరవాణి(Keeravani), ఇళయరాజా (Ilayaraja) వంటి ఎంతో మంది సీనియర్ల పేర్లు వినిపించేవి.ఇక ఇప్పటి జనరేషన్ సినిమాలైతే ఖచ్చితంగా మాకు తమన్ మ్యూజికే కావాలి అంటున్నారు. ఇటు ప్రేక్షకులతో పాటు అటు హీరో, డైరెక్టర్ కూడా తమన్ కే ఓటు వేయడంతో టాలీవుడ్ లో తమన్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం తమన్, డిఎస్పీ (DSP) మధ్య గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ (Balakrishna) వంటి హీరోలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే తమన్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అంతలా బాలకృష్ణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో నందమూరి తమన్ అంటూ భువనేశ్వరి ఆయన్ని నందమూరి ఫ్యామిలీలో కలుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది వరుస సినిమాలు చేశారు తమన్.ఇక ఈ ఏడాది కూడా ఆయన డాకు మహారాజ్(Daku Maharaj), గేమ్ ఛేంజర్ వంటి రెండు సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇక డాకు మహారాజు బిజిఎం తో పాటు పాటలు కూడా హైలెట్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఒక షాకింగ్ విషయం చెప్పారు.
నమ్మిన వాళ్లే మోసం చేశారు..
తమన్ మాట్లాడుతూ.. “నాలాగే చాలామంది ఏదో ఒక సందర్భంలో కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయి ఉంటారు. అలా నేను కూడా కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయాను. చాలామంది నా అనుకున్న వాళ్ళే నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశారు. అలా నేను చాలా సార్లు డబ్బు విషయంలో మోసపోయాను. ఒక రకంగా నమ్మినవాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు అంటే నేను ఇలాంటివి ఎన్ని ఫేస్ చేసానో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక కొంతమంది వ్యక్తులు మన ముందు ఒకలా మన వెనక మరోలా మాట్లాడుతూ ఉంటారు. అలా నా జీవితంలో కూడా కొంతమంది ఉన్నారు. నా ముందేమో నన్ను మెచ్చుకుంటూ మాట్లాడారు. కానీ ఆ తర్వాత బయటకు వెళ్లాక నా గురించి చెత్త రూమర్లు క్రియేట్ చేశారు. అలాంటి వారు నా జీవితంలో ఎంతో మంది ఉన్నారు. ఇక నా లైఫ్ లో ఇలాంటి అనుభవాలు నాకు ఎన్నో ఎదురయ్యాయి.అందుకే జీవితంలో ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి ఒడిదుడుకుల వల్ల నేను ఎంతగానో ఇబ్బంది పడ్డాను” అంటూ తమన్ (Thaman) ఆ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అదే ఇంటర్వ్యూలో తమన్ తనకి క్రికెట్ అంటే ఇష్టమని, స్టార్ క్రికెటర్స్ అందరూ కలిసి ఆడే గ్రౌండ్లో ఆడాలనే కోరిక నాకు ఉంది.కానీ అది ఇప్పటికీ కూడా కుదరలేదని, ఎక్కడో ఓ మూల కాస్త బాధ ఉంటుంది అంటూ తమన్(Thaman) తన మనసులో ఉన్న మాట బయట పెట్టేశారు.